సర్వ మతాల అభ్యున్నతికి రాజ్యాంగ పరిరక్షణ కావాలి…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; ఏప్రిల్ 8 (అండ భూమి న్యూస్);
రాజ్యాంగ పరిరక్షణ కోసం ప్రజల ఉద్యమించవలసిన సమయం ఆసన్నమైందని కాంగ్రెస్ నాయకులు పేర్కొన్నారు మంగళవారం దోమకొండ మండలం అంబరీపేట గ్రామంలో జై బాపు జై భీమ్ జై సoవిధాన్ కార్యక్రమం గ్రామ అధ్యక్షుడు ఈశ్వర్ గౌడ్ ఆధ్వర్యంలో జరిగింది ఈ సందర్భంగా పార్టీ మండల అధ్యక్షుడు అనంతరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి అబ్రబోయిన స్వామి లు మాట్లాడుతూ. కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేసే విధంగా ఉందని విమర్శించారు. మత సమరస్యాన్ని కాపాడాలని ప్రజలకు సూచించారు. ప్రపంచ దేశాల రాజ్యాంగాలను పరిశీలించి పరిశోధించి ఈ దేశానికి అనుకూలంగా తయారుచేసిన పరిపాల నా విధానమే భారత రాజ్యాంగం అని పేర్కొన్నారు. ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు చేపడితే కేంద్ర ప్రభుత్వంపై ప్రజల నుంచి తిరుగుబాటు తప్పదని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ఎస్సీ సెల్ మండలాధ్యక్షుడు రాజం, జిల్లా నాయకులు రామస్వామి గౌడ్, మాజీ జెడ్పిటిసి తిరుమల గౌడ్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ గోపాల్ రెడ్డి, నాయకులు నల్లప శ్రీనివాస్ ,శంకర్ రెడ్డి, సీతారాం మధు, వినీత్, సంతోష్ రెడ్డి ,శమీ, శ్రీనివాస్ రెడ్డి, నిమ్మ శేఖర్, జనార్దన్ రెడ్డి, రాజయ్య, సంజీవ్, రాజేందర్ ,రాజు ,నహీం, తదితరులు పాల్గొన్నారు,