సామాజిక కార్యకర్త డోన్ పి. మహమ్మద్ రఫి
మే 7న జాతీయ గీతం రచయిత శ్రీ రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి మరియు స్వాతంత్ర్య సమర యోధులు శ్రీ అల్లూరి సీతారామరాజు గారి వర్ధంతి సందర్భంగా
డోన్ పట్టణం నందు సామాజిక కార్యకర్త పి. మహమ్మద్ రఫి ఆధ్వర్యంలో మన జాతీయ గీతం రచయిత శ్రీ రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి మరియు స్వాతంత్ర్య సమరయోధులు అల్లూరి సీతారామరాజు గారి వర్ధంతి సందర్భంగా వారి చిత్రపటాలకు పూలమాల వేసి ఘణంగా నివాళులు అర్పించారు. వారిని స్మరించుకున్నారు
ఈ సందర్బంగా సామాజిక కార్యకర్త డోన్ పి. మహమ్మద్ రఫి మాట్లాడుతూ మన దేశ స్వాతంత్య్ర సమరయోధులను, శాస్త్రవేత్తలను ,మహనీయులను, సమాజానికి సేవలు అందించిన ప్రతి ఒక్కరిని స్మరించుకుంటూ వారి అడుగుజాడల్లో నడవాలని సామాజిక కార్యకర్త డోన్ పి.మహమ్మద్ రఫి పేర్కొన్నారు