కామారెడ్డి వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గము సాధారణ సమావేశం.
కామారెడ్డి జిల్లా ప్రతినిధి ; (అఖండ భూమి న్యూస్ );
కామారెడ్డి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ లక్ష్మీరాజగౌడ్ ఆధ్వర్యంలో పాలకవర్గం కార్యాలయ సిబ్బంది సాధారణ సమావేశం వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయం నందు బుధవారం నిర్వహించడం జరిగింది. సమావేశంలో వడ్లకొనుగోలు కేంద్రాలలో ఇబ్బందులు జరగకుండా తగిన సామాగ్రి సమకూర్చాలని తీర్మానించడం జరిగింది. అలాగే గడచిన మూడు నెలల్లో మార్కెట్ కమిటీ యొక్క ఆదాయవ్యయాలు, అభివృద్ధిపై చర్చించడం జరిగింది. అలాగే గ్రేడ్3 సెక్రెటరీగా పనిచేస్తూ మృతి చెందిన నర్సింలు గారికి మౌనం వహించి సంతాపం తెలిపారు. ఈ యొక్క కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మినుకురి బ్రహ్మానందరెడ్డి, డైరెక్టర్లు వలిపిశెట్టి లక్ష్మీరాజం, అవుసుల బ్రహ్మం, నూనవత్ గణేష్ నాయక్, దోమకొండ శ్రీనివాస్, మక్బూల్, రాజలింగం, కొత్త అరవింద్, జ్యోతిరెడ్డి, భూమయ్య, సుదర్శన్ రావు, జిల్లెల భూపతి , కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
You may also like
దోమకొండ శివరాం మందిర్ ఆలయంలో ఎమ్మెల్యే కాటిపల్లి సహకారంతో రథశాల రేకుల షెడ్డు ఏర్పాటు…
నటుడు ప్రకాష్ రాజ్‌పై నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ…
దోమకొండ ఎంపీడీవో ని సన్మానించిన సీతారాం మధు ముదిరాజ్…
దోమకొండ లో మండల ఉపసర్పంచ్ ఫోరం అధ్యక్షుడు గా సిరిగాధ మహేందర్ గౌడ్
ప్రభుత్వం ప్రోత్సహిస్తున్న 7 వరి రకాలను సాగు చేసి బోనస్ పొందాలి…



