హామీలు అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం..!
మాజీ ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్..
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; ఏప్రిల్ 22 (అఖండ భూమి న్యూస్);
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలలో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందని కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే విప్ గంప గోవర్ధన్ అన్నారు. మంగళవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఈ సందర్భంగా మాట్లాడుతూ. ఈనెల 27న వరంగల్ జిల్లా ఎలకతుర్తి గ్రామంలో నిర్వహించే మహాసభకు పెద్ద ఎత్తున గులాబీ శ్రేణులు హాజరయ్యే విధంగా సహకరించాలని ఆయన అన్నారు. టిఆర్ఎస్ పార్టీ 25 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ సభను పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సభకు పెద్ద ఎత్తున కార్యకర్తలు నాయకులతో పాటు టిఆర్ఎస్ అభిమానులు స్వచ్ఛందంగా తరలిరావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ నాయకులు షేక్ అబ్దుల్ మజీద్, పట్టణ అధ్యక్షుడు జూకాంటి ప్రభాకర్ రెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కుంభాల రవి యాదవ్, పట్టణ నాయకులు, కార్యకర్తలు, ఆటో యూనియన్ అధ్యక్షులు అల్తాఫ్ హాజరైనారు.
ఆటోలకు స్టిక్కర్ ఆవిష్కరణ..!
చలో వరంగల్ ఆటో స్టిక్కర్ ల కు కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ ఆటోలకు స్టిక్కర్ లు అతికించి ప్రారంభించారు. వరంగల్ జిల్లా ఎలుకతుర్తి గ్రామంలో ఈనెల 27న నిర్వహించే
భారీ బహిరంగ సభ కోసం ప్రజల్లో చైతన్యం ప్రచారం నిర్వహించేందుకు వాల్పోస్టర్ లు, స్టిక్కర్లను అతికించినట్లు తెలిపారు.
You may also like
జిల్లాలో బతుకమ్మ ఉత్సవాలను వైభవంగా నిర్వహించాలి కలెక్టర్ ఆదేశాలు జారీ…
సీఐటీయూ ఆధ్వర్యంలో డిపిఓ జిల్లా పంచాయతీ అధికారి కార్యాలయాన్ని ముట్టడించిన గ్రామపంచాయతీ కార్మికులు
ఎల్లారెడ్డి పట్టణంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభం…
మద్యం సేవించిన 29 మందికి జైలు శిక్ష జరిమానాలు…
దళిత మహిళ అటెండర్ పై కుల వివక్షత చూపిన తహసిల్దార్ ను వెంటనే సస్పెండ్ చేయాలి…