సైబరాబాద్‌లో కల్తీ ముఠా. కుళ్లిన అల్లం, వెల్లుల్లితో పేస్ట్‌..

 

హైదరాబాద్ అఖండ భూమి వెబ్ న్యూస్ :

రాష్ట్ర రాజధాని నగరంలో కల్తీ ఉత్పత్తి రోజురోజుకూ పెరుగుతోంది. నకిలీ తయారీ కేంద్రాలపై ఎప్పటికప్పుడు పోలీసులు దాడులు నిర్వహించి కల్తీ నిర్వాహకులను అరెస్ట్ చేస్తున్నా కానీ.. ఇలాంటి కల్తీ కేడీలు రోజురోజుకు బయటికి వస్తూనే ఉన్నారు. తాజాగా సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో కల్తీ సరుకులు తయారు చేస్తున్న ముఠా గుట్టును ఎస్‌ఓటీ పోలీసులు రట్టు చేశారు..కాటేదాన్ ఇండస్ట్రియల్ ఎస్టేట్‌లో కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్, మ్యాంగో కూల్ డ్రింక్ తయారు చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు.. వారి నుంచి సుమారు 500 కిలోల నకిలీ అల్లం వెల్లుల్లి పేస్ట్, లిటిల్ చాప్స్ అనే మ్యాంగో డ్రింక్ స్వాధీనం చేసుకున్నారు.. కుళ్లిన అల్లం, వెల్లుల్లితో పేస్ట్‌ను తయారు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్‌లో ఎసిటిక్ యాసిడ్ వంటి ప్రమాదకరమైన రసాయనాలు కలుపుతారు.. మనుషుల జీవితాలతో ఆడుకుంటూ కల్తీ అల్లం వెల్లుల్లి పేస్టును తయారు చేస్తున్న ఈ అక్రమార్కులు.. వెల్లుల్లిపాయల తొక్కను కూడా వదలడం లేదు.. యంత్రాల్లో కుళ్లిన అల్లం, వెల్లుల్లితో పాటు వెల్లుల్లిపాయల పొట్టు వేసి పేస్ట్ తయారు చేస్తున్నట్లు గుర్తించారు..

Akhand Bhoomi News

error: Content is protected !!