గాయత్రి మహాయాగంలో పాల్గొన్న కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి ; ఏప్రిల్ 27 (అఖండ భూమి న్యూస్);
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఆర్య సమాజ్ వారి ఆహ్వానం మేరకు స్థానిక శిశు మందిరంలో జరిగిన కామారెడ్డి ఆర్య సమాజ్ 50 సంవత్సరాల సంవత్సరం మహాయాగంకు కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి శనివారం ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఆర్య సమాజ్ 50 సంవత్సరాల భాగంగా అష్టోత్తర (108) శత కుండియా గాయత్రి మహాయాగంలో ముఖ్యఅతిథిగా పాల్గొని కామారెడ్డి ఆర్య సమాజ ంలో భాగంగా 2025 పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఆర్య సమాజ్ సభ్యులతోపాటు పట్టణ ప్రజలు, పాల్గొన్నారు.