పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి…

 

కాంగ్రెస్ పార్టీ చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి…

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; మే 2 (అఖండ భూమి న్యూస్);

కామారెడ్డి జిల్లాస్థాయి సమావేశం పిసిసి ఆదేశాల మేరకు

కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కైలాస్ శ్రీనివాసరావు అధ్యక్షతన జిల్లా విస్తృత స్థాయి సమావేశం నిర్వహించడం జరిగింది.

 

ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిలుగా ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ ,, జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీ కాంతారావు, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు, మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి. ఆగ్రో పరిశ్రమల రాష్ట్ర చైర్మన్ కాసుల బాలరాజ్. జిల్లా ఇన్చార్జ్ లు. సత్యనారాయణ గౌడ్. వేణుగోపాల్ యాదవ్ లు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా షబ్బీర్ అలీ గారు మాట్లాడుతూ..

ఈరోజు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం కుల గణన నిర్వహించి దేశానికే ఆదర్శంగా నిలిచింది

 

ప్రజలు మనల్ని నాయకులుగా ఉన్నందుకు ప్రజల సమస్యలు తీర్చడానికే ఎక్కువ సమయం ఇవ్వాలని, అప్పుడే ప్రజా నాయకులం అవుతాం తప్ప పదవుల కోసం పాకులాడితే కుదరదని అన్నారు.

 

బిఆర్ఎస్ బీజేపీ జిల్లాకు చేసిందేమీ లేదు. ఇవన్నీ మనం ప్రజలకు శెట్టి ప్రజల్లోకి లోతుగా తీసుకెళ్లాలని అన్నారు.

 

నేను మంత్రిగా ఉన్నప్పుడు ప్రజలకు త్రాగు సాగు నీరు అందాలని ప్యాకేజ్ 21,22,23 ప్రాజెక్టు తీసుకువస్తే దానిని వారి స్వార్థాల కొరకు ఆపినారు అన్నారు.

300 కోట్లతో అయిపోయే పనిని 3000 కోట్లు పెట్టీ కాంట్రాక్టులకు ఇచ్చారు అని అన్నాడు.

చిన్న చిన్న గొడవలు పక్కన పెట్టీ రాబోయే ఎన్నికల్లో ముందుకు వెళ్ళాలి అని అన్నారు.

ప్రజలకు సేవ చేసే విధంగా కాంగ్రెస్ నాయకులు లక్ష్యం పెట్టుకోవాలి అన్నారు.

యంత్రాంగం లో జరిగే తప్పులను సరిచేస్తూ ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలి అన్నారు.

కార్యకర్తలు ఐక్యంగా ఉంటే అందరికీ పదవులు ఇచ్చే విధంగా కృషి చేస్తాం అన్నారు.

ఇన్ని రోజులు కార్యకర్తలు మన గెలుపు కోసం కష్టపడ్డారు. ఇప్పుడు వారి రుణం తీర్చుకోవడానికి సమయం ఆసన్నమైంది వారికోసం పనిచేసి వారిని గెలిపించి నాయకులు గా తీర్చి దిద్దాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.

జిల్లాలో క్రమపద్ధతిలో నీళ్లు నిల్వ చేస్తూ పంటలు పండిస్తున్నాము అని అన్నా రు.

అందరూ పార్టీ సమావేశాలు తప్పకుండా రావాలి అన్నారు.

ఏఐసీసీ ఆదేశాలు మేరకు గ్రామ,మండల,బ్లాక్ కమిటీలు ఏర్పాటుకు అందరూ సహకరించాలి అన్నారు.

కార్యకర్తలకు బాధ్యతలు,పదవులు ఇవ్వడమే మా లక్ష్యం అని అన్నారు.

భూ భారతీ ద్వారా రైతుల సమస్యలు పరిష్కరిస్తున్నాము అని అన్నారు.

కెసిఆర్ డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పేరుతో కమిషన్లు తిన్నారు అని అన్నారు.

కానీ కాంగ్రెస్ ప్రభుత్వం నియోజకవర్గానికి 3500 ఇళ్లు ఇస్తుంది అని అన్నారు.

ఒక్కొక నియోజకవర్గానికి 10000 ఇల్లు ఇవ్వడానికి ప్రణాళిక సిద్ధంగా ఉందని అన్నారు.

మన వాళ్ళు వేరే వాళ్ళు అనే తేడా లేకుండా ప్రతి పేదవాడికి ఇల్లు అందిస్తాం. ఇల్లు నిర్మాణ పనులను బట్టి నిధులు మంజూరు అవుతాయి అని అన్నారు.

జై బాపు జై భీం జై సంవిధాన్ అభియాన్ కార్యక్రమము గ్రామ గ్రామాన తీసుకు వెళ్తున్నారు అని గుర్తు చేశారు. ఈ కార్యక్రమాన్ని ఇంకా గట్టిగా ప్రజల్లోకి తీసుకుపోవాలి అని అన్నారు.

పార్టీ లేకుంటే కండువా లేకుంటే మనకు అవకాశం ఇచేది ఎవరు అని అన్నారు

పాత కొత్త అనే తేడా ఉండకూడదు. పార్టీని బలోపేతం చేయాల్సిన బాధ్యత మనపైన ఉంది అని గుర్తు చేశారు.

ఎవరైతే కింది స్థాయిలో పార్టీ జెండా మోసి బలోపేతానికి పనిచేశారో వారిని గుర్తించి వారికి పదవులు ఇస్తాం అన్నారు.

క్రమశిక్షణ కలిగిన వారికే పార్టీ పదవులు వస్తాయి అన్నారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అనుబంధ సంఘాల ప్రెసిడెంట్లు, మండల అధ్యక్షులు, గ్రామ అధ్యక్షులు, మాజీ జెడ్పిటిసి లు మాజీ ఎంపీటీసీలు సర్పంచులు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!