మరి కాసేపట్లో తెలంగాణలో వర్షాలు…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; మే 25 (అఖండ భూమి న్యూస్);
తెలంగాణ రాష్ట్రంలో మరో రెండు గంటల్లో మోస్తారు వర్షాలు కురుస్తాయని వాతావరణ నిపుణులు తెలిపారు. సిద్దిపేట, మెదక్, యాదాద్రి, జనగాం, హనుమకొండ, వరంగల్, నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం,, మహబూబ్నగర్, నిజామాబాద్, జగిత్యాలలో వర్షాలు పడతాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో మరో నాలుగు రోజుల్లో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు.