ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు త్వరలో కళ్యాణ మండపాల ని నిర్మాణాలు…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; మే 25 (అఖండ భూమి న్యూస్);
ఎన్నికలలో ఇచ్చిన హామీల మేరకు కామారెడ్డి నియోజకవర్గంలో త్వరలో కళ్యాణ మండపాల పనులను ప్రారంభిస్తానని కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి అన్నారు. ఆదివారం రాజంపేట మండలం తడమట్ల గ్రామంలో జై భవాని రూపింగ్ ఇండస్ట్రీస్ రేకుల కంపెనీని ప్రారంభించి ఈ సందర్భంగా మాట్లాడారు. కామారెడ్డి నియోజకవర్గంలో రేకుల పరిశ్రమ రావడం అభినందనీయమని అన్నారు. కామారెడ్డి నియోజకవర్గంలో మరిన్ని ఇండస్ట్రీస్ వచ్చి ప్రతి ఒక్కరికి ఉపాధి దొరికే విధంగా తన వంతు కృషి నియోజకవర్గ ప్రజలకు ఉంటుందని అన్నారు. కామారెడ్డి నియోజకవర్గం భవిష్యత్తులో మంచి పరిశ్రమల కేంద్రంగా ఎదుగుతుందని అన్నారు. ఇలాంటి పరిశ్రమలను నియోజకవర్గంలో ప్రోత్సహించే ఆహ్వానించాలని అన్నారు. కామారెడ్డి నియోజకవర్గంలో నిరుద్యోగులకు పరిశ్రమల ద్వారా చేయూత అందించడమే లక్ష్యంగా పనిచేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో రేకుల షెడ్ పరిశ్రమ సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు.