కామారెడ్డి బుర్ర మత్తడి శుభ్రం చేయించిన ఎమ్మెల్యే…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; మే 25 (అఖండ భూమి న్యూస్);
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని బుర్ర మత్తడి ఏరియా కాలువలో వర్షాకాలం దృష్టిలో ఉంచుకొని ముందస్తుగా కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి ఆదివారం శుభ్రం చేయించారు. వర్షాకాలం దృష్టిలో ఉంచుకొని కాలువలో పెద్ద చెట్లను తొలగించి, చెత్తను శుభ్రం చేయించారు. ఈ పనులను ఎమ్మెల్యే పరిశీలించారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి ప్రజలు పాల్గొన్నారు.