ఇండో,బంగ్లా త్రిపుర రాష్ట్ర సరిహద్దుల వద్ద ఉన్న సరిహద్దు ప్రాంత భారత సైనికుల ను కలిసిన బిజెపి రాష్ట్ర మాజీ కార్యదర్శి
కామారెడ్డి జిల్లా ప్రతినిధి మే 25.(అఖండ భూమి న్యూస్)
భారత సైనికులను కలవడం నా అదృష్టంగా భావిస్తున్నానని తెలంగాణ రాష్ట్ర మాజీ కార్యదర్శి, మేడ్చల్ ఇంచార్జ్ మురళీధర్ గౌడ్ ఒక ప్రకటనలో తెలిపారు అన్నారు. భారత్ దేశం,బంగ్లాదేశ్ మధ్య సరిహద్దు వద్ద ఇండో,బంగ్లా త్రిపుర రాష్ట్ర ల వద్ద ఉన్న సరిహద్దు ప్రాంతం కు వెళ్లి మన భారత సైనికుల ను కలిసి వారి సైనిక ప్రదర్శనలు తిలకించడం జరిగింది. ఈ సందర్భంగా వారి ధైర్య సాహసాలు వారు దేశ రక్షణ కోసం సరిహద్దు వద్ద కంటికి రెప్పలా మనదేశాన్ని కాపాడుకుంటూ ఉన్నారన్నారు. ఈ సందర్భంగా వారికి స్వయంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేయడం సంతోషంగా ఉందనీ,భారత ప్రజలమైన మేమంతా మీ వెంటే ఉంటామని తెలియజేయడం జరిగిందన్నారు. సరిహద్దు ప్రాంతానికి వెళ్లి అక్కడ మన సైనికులను మనకోసం కష్టపడుతున్న వారిని చూసి గర్వంగా ఉందనీ, నా జీవితంలో వారిని ప్రత్యక్షంగా కలువడం వారికి శుభాకాంక్షలు తెలియజేసినందుకు నాకు చాలా సంతోషం కలిగింది, ఇది నాకు నా జీవితంలో ప్రత్యేక మైన రోజు గా భావిస్తున్నాను అని ఒక ప్రకటనలో పేర్కొన్నారు.