మీసేవ కేంద్రాలకు “పరీక్షా” కాలం

 

మీసేవ కేంద్రాలకు “పరీక్షా” కాలం

– మీసేవ కేంద్రాల ప్రస్తావన లేకున్నా మూసి ఉంచాలని నోటీసులు

మండల కేంద్రంలో ఇంటర్మీడియట్ పరీక్షల నేపథ్యంలో ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 5:30 గంటల వరకు జిరాక్స్ కేంద్రాలు మూసి ఉంచాలని పోలీసు శాఖ జిరాక్స్ కేంద్రాల నిర్వాహకులకు నోటీ సులు జారీచేసింది. పరీక్షల్లో మాస్ కాపీయింగ్ నివారణకు మైక్రో జిరాక్స్లు తీయకుండా చర్యలు తీసుకోవడం సహజమే. ఇదంతా బాగానే ఉన్నప్పటికీ గతంలో ఎన్నడూలేని విధంగా ఈ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు జరుగుతున్న సమయంలో మీ సేవ కేంద్రా లను సైతం మూసి ఉంచాలని పోలీసులు నోటీసులు జారీచేశారు. నోటీసులో మీ సేవ కేంద్రాల ప్రస్తావన లేనప్పటికీ నోటీసులు జారీ చేశారు. దీంతో మండలంలో ఈ నెల 22 నుంచి మీ సేవ కేంద్రాలు ఉదయం నుంచి సాయంత్రం వరకు మూసి ఉంచుతున్నారు. కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు మొదలు కొని సుమారు 350కి పైగా పౌర సేవలు అందించే మీ సేవ కేంద్రాలను మూసి ఉంచడం వల్ల ప్రజలు, దరఖాస్తుదారులు ఇబ్బందులు పడు తున్నారు. పూర్తి అయినా సర్టిఫికెట్లు ప్రింట్ అవుట్ ఇవ్వలేక సతమతమవుతున్నారు. అసలే విద్యార్థులు ధ్రువీకరణ పత్రాలు పొందేకాలం కావడంతో కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి నెలకొంది. అదే జరిగితే ఈ నెల 28 వరకు మీ సేవలు మూసి ఉంచాల్సి వస్తుందని నిర్వాహకులు వాపోతున్నారు. ఉన్నతా ధికారులు స్పందించి జిరాక్స్ మిషన్స్ లేని మీ సేవ కేంద్రాలకు మిన హాయింపు ఇవ్వాలని మీ సేవ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షుడు సునిల్, తెలంగాణ మీ సేవ ఆపరేటర్ అసోసియేషన్ అధ్యకుడు బలవంతరావ్, ఉపాధ్యక్షుడు దేవరగట్టు రాజేశ్వర్ , మీసేవ నిర్వాహకులు కోరుతున్నారు.

 

ఇంటర్మీడియట్ పరీక్షల నేపథ్యంలో మీసేవ కేంద్రాలు బంద్…

 

రాష్ట్ర ప్రభుత్వం ఇంటర్మీడియట్ సప్లమెంటరీ పరీక్షలు జరుగుతున్న తరుణంలో జిల్లా పోలీస్ శాఖ ఆదేశాల మేరకు ఎలాంటి జిరాక్స్, కంప్యూటర్ ప్రింటెడ్ లు రాకుండా జిరాక్స్ సెంటర్ తో పాటు మీసేవ కేంద్రాలను సైతం మూసివేయాలని పోలీస్ శాఖ ఆదేశాలు చేసింది. పరీక్షల సమయంలో ఎలాంటి మాల్ ప్రాక్టీస్ లకు తావు లేకుండా ఉంచడానికి జిల్లా పోలీస్ శాఖ ఆదేశాలు జారీ చేసింది. దీంతో మీసేవ వినియోగదారులు సైతం కొంతమేర ఇబ్బందులు పడుతున్న సాయంత్రం సమయంలో మీసేవ కేంద్రాలను ఉపయోగించుకుంటున్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!