భాదిత కుటుంబాలను పరామర్శించి ఆర్థిక సహాయం అందించిన స్థానిక ఎమ్మెల్యే మదన్ మోహన్…
 
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూన్ 12 (అఖండ భూమి న్యూస్)
కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గం పరిధిలోని రాజంపేట మండలం బస్వన్నపల్లి గ్రామానికి చెందిన తాత సిద్ది రాములు (50) మనవడు శ్రేయాంక్ (04) వెళ్తున్న వాహనాన్ని బస్సు ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందడం జరిగిన విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే మదన్ మోహన్ బస్వన్నపల్లి గ్రామంలో గల సిద్ది రాములు & శ్రేయాంక్ కుటుంబ సభ్యులను పరామర్శించి వారిని ఓదార్చి, ఆర్థిక సహాయం అందించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మదన్ మోహన్ మాట్లాడుతూ. ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోవడం చాల బాధాకరం అని అన్నారు. చనిపోయిన వారి కుటుంబసభ్యులకు ప్రభుత్వం తరపున నుండి పరిహారం అందేలా చూస్తానని హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల వర్కింగ్ ప్రెసిడెంట్, మండల సీనియర్ కాంగ్రెస్ నాయకులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


