స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్
పై కలెక్టర్ రివ్యూ…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; అక్టోబర్ 3 (అఖండ భూమి న్యూస్);
రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ) ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించాలని అన్ని జిల్లా ఎన్నికల అధికారులను ఆదేశించారు.
శనివారం ఆయన హైదరాబాద్ నుండి రాష్ట్ర అదనపు ప్రధాన ఎన్నికల అధికారి లోకేష్ కుమార్, ఇతర ఉన్నతాధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో అన్ని జిల్లాల కలెక్టర్లు, జిల్లా ఎన్నికల అధికారులు (డి ఓ ఎస్), ఎన్నికల రిజిస్టరింగ్ అధికారులు (ఈ ఆర్ ఓ ఎస్) పాల్గొన్నారు.
గత శనివారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ అనంతరం ఇప్పటి వరకు జిల్లాల వారీగా చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమాల పురోగతిపై సమీక్ష చేపట్టారు.
కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాలు నుండి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, అదనపు కలెక్టర్ విక్టర్, సంబంధిత విభాగాల అధికారులు సమావేశంలో పాల్గొన్నారు.
సమీక్షా సమావేశంలో
మ్యాపింగ్ కార్యక్రమాఎన్ని బి ఎల్ ఓ లు, సూపర్వైజర్లు పోలింగ్ కేంద్రకవారిగా పకడ్బందీగా నిర్వహించాలని
క్యాటగిరి వారిగా ప్రక్రియను గడువులోగా పూర్తి చేయాలని ఆన్నారు.


