భారతీయ విద్యార్థి మోర్చ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం…

*భారతీయ విద్యార్థి మోర్చ ఆధ్వర్యంలో

రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం…

*పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని..

*ప్రైవేట్ డిగ్రీ ,పీజీ,ఇంజనీరింగ్ వృత్తి కోర్సుల విద్యా సంస్థలు బంద్ కి భారతీయ విద్యార్థి మోర్చ పూర్తి మద్దతు ప్రకటిస్తుంది..

*విద్యాశాఖ మంత్రినివెంటనే నియమించాలి…

*ఙివియం విఠల్*

*భారతీయ విద్యార్థి మోర్చ రాష్ట్ర కార్యదర్శి.

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; నవంబర్ 4 (అఖండ భూమి న్యూస్);

రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ వెంటనే విడుదల చేయాలని భారత విద్యార్థి మోర్చ ఆధ్వర్యంలో ప్రభుత్వ దిష్టిబొమ్మ దానం చేయడం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి ఙివియం విఠల్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విద్యా శాఖ మంత్రిని నియమించాలి.రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు అందించవలసిన స్కాలర్‌షిప్ మరియు రీయింబర్స్‌మెంట్ సంవత్సరల తరబడి విడుదల చేయకపోవడం వల్ల వేలాది మంది విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.ప్రైవేట్ కళాశాలల్లో చదువుతున్న పేద మరియు మధ్యతరగతి విద్యార్థులు కళాశాలల నుంచి ఫీజులు చెల్లించమని ఒత్తిడి ఎదుర్కొంటున్నారు. ఫలితంగా చాలా మంది తమ విద్యను కొనసాగించడంలో ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం దీపావళి వరకు 1200 కోట్లు విడుదల చేస్తామని చెప్పి ఇవ్వకపోవడం సిగ్గుచేటు అన్నారు.విద్యార్థుల పట్ల ప్రేమ ఉంటే ఏలాంటి షరతులు లేకుండా విడుదల చేయాలని అన్నారు. కొన్ని ప్రైవేటు విద్యాసంస్థలు ఫీజు రియంబర్స్మెంట్ పైననే ఆధారపడి నడుపుతున్నారు. ఆ కళాశాలలో జీతాలు ఇవ్వలేక ఇటు విద్యార్థులకు న్యాయం చేయలేక విద్యా సంస్థలు మూసుకునే పరిస్థితి ఏర్పడింది అన్నారు. ప్రైవేట్ కళాశాలల నిర్వహిస్తున్న బంద్ సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నము. అదే విధంగా,

విద్యార్థుల సమస్యలు పరిష్కరించకపోతే భారత విద్యార్థి మోర్చ విద్యార్థి సంఘాల ,విద్యార్థులు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున విద్యార్థి ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు ఆర్బాస్ ఖాన్ ,ఇంచార్జ్ పెరుమాండ్ల బుల్లెట్ ,కార్యదర్శి శ్యామ్, నాయకులు కార్తిక్, శివ, ప్రశాంత్ విద్యార్థులు పాల్గొన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!