జూబ్లీ హిల్స్ ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి *ఆపరేషన్ సింధూర్ పై* అనుచిత వ్యాఖ్యలకు దిష్టిబొమ్మ దహనం..!

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; నవంబర్ 2 (అఖండ భూమి న్యూస్);
నిరసనగా బీజేపీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు జిల్లా కేంద్రంలోని కొత్త బస్ స్టాండ్ వద్ద ఆదివారం రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మ దగ్ధం చేశారు.
ఈ సందర్భంగా బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు నంది వేణు మాట్లాడుతూ. గత రెండు సంవత్సరాల పాలనలో ఒక్క మంచి పని చేయకపోవడంతో ఓటు అడిగే ముఖం లేక రాష్ట్ర ముఖ్య మంత్రి సైనికులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఆపరేషన్ సింధూర్ నీ అవమానిస్తూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం సమంజసం కాదు అని, జూబ్లీ హిల్స్ ఉపఎన్నికలో ఓటమి భయంతోనే రేవంత్ రెడ్డి బీజేపీ పై, కేంద్ర మంత్రులపై ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. రాజకీయాల్లోకి సరిహద్దు వివాదాలను, సైనికులను తీసుకు రావద్దు అని హెచ్చరించారు. అధికారంలోకి వచ్చిన నాటి నుండి ఇచ్చిన హామీ నీ ఒక్కటి నెరవేర్చలేదని అలాంటి కాంగ్రెస్ ఉప ఎన్నికల్లో గెలుపు కోసం ఆపసోపాలు పడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి, బీజేవైఎం నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.


