దోమకొండ గడికోట ఆధ్వర్యంలో సమూహిక అక్షరాభ్యాస మహోత్సవం…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూన్ 15 (అఖండ భూమి న్యూస్)
దోమకొండ మండల కేంద్రంలో సామూహిక అక్షరభ్యాస మహోత్సవం కార్యక్రమం ను గడికోట వారసుడు కామినేని అనిల్ ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. గడికోటలో సరస్వతి దేవి పూజ నిర్వహించి 170 చిన్నారులకు అక్షరభ్యాసం చేయించారు. ఈ కార్యక్రమానికి గడి కోట వారసుడు కామినేని అనిల్, రాజేశ్వరరావు, 2025 సంవత్సరం పదవ తరగతి పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఐదుగురు విద్యార్థులకు మొదటి నగదు ప్రోత్సాహకాలు అందించారు. మొదటి బహుమతి నవదీప్ 25000, ద్వితీయ సన్నీహితకు 20000 రూపాయలు, తృతీయ స్థానంలో 18 వేల రూపాయలు, పదిహేను వేల రూపాయల చొప్పున స్కాలర్షిప్లు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి తిరుమల గౌడ్, నల్లపు శ్రీనివాస్, నాగరాజ్ రెడ్డి, అంగన్వాడీ టీచర్లు, ట్రస్ట్ మేనేజర్ బాబ్జి, దోమకొండ రాష్ట్ర ప్రతినిధులు గణేష్ యాదవ్, రాజశేఖర్, ఆనంద్, వెంకటలక్ష్మి, కల్పన పాల్గొన్నారు.
You may also like
దుర్గామాతకు ఏ రోజు ఏ ప్రసాదం సమర్పించాలి..?
గ్రాడ్యుయేషన్లు జీవిత లక్ష్యం వైపు దృష్టి సారించాలి…
నాసిరకం నిత్యవసర వస్తువులను విక్రయిస్తున్న సూపర్ మార్కెట్లపై చర్యలు తీసుకోవాలి…
జిల్లాలో బతుకమ్మ ఉత్సవాలను వైభవంగా నిర్వహించాలి కలెక్టర్ ఆదేశాలు జారీ…
సీఐటీయూ ఆధ్వర్యంలో డిపిఓ జిల్లా పంచాయతీ అధికారి కార్యాలయాన్ని ముట్టడించిన గ్రామపంచాయతీ కార్మికులు