కామారెడ్డి నియోజకవర్గంలో పలు ఆలయాల్లో పూజలు చేసిన ఎమ్మెల్యే కాటిపల్లి…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూన్ 15 (అఖండ భూమి న్యూస్)
కామారెడ్డి నియోజకవర్గం లోని పలు మండలాల్లో ఆలయాలు పూజలు నిర్వహించి, కమ్యూనిటీ హాల్ ను ఆదివారం ప్రారంభించారు. పొందుర్తిలో గౌడ సంఘం ఆహ్వానం మేరకు రేణుక ఎల్లమ్మ ఆలయం, అదే గ్రామంలో ముదిరాజ్ సంఘం ఆహ్వానం మేరకు ఆలయంలో పూజలు నిర్వహించి ముదిరాజ్ కళ్యాణ మండపాన్ని రిబ్బన్ కత్తిరించి ప్రారంభించారు. పొందుర్తి హనుమాన్ ఆలయ కమిటీ ఆహ్వానం మేరకు ఆలయంలో పూజా కార్యక్రమంలో పాల్గొని, రాజంపేట మండలం తలమడ్ల గ్రామ రజక సంఘం ఆహ్వానం మేరకు మడివేలు మాచయ్య స్వామి, కళ్యాణ మహోత్సవం సందర్భంగా పాల్గొన్నారు. కార్యక్రమంలో బిజెపి నాయకులతో పాటు ఆయా గ్రామాల ప్రజలు భక్తులు సంఘ ప్రతినిధులు పాల్గొన్నారు.
You may also like
దుర్గామాతకు ఏ రోజు ఏ ప్రసాదం సమర్పించాలి..?
గ్రాడ్యుయేషన్లు జీవిత లక్ష్యం వైపు దృష్టి సారించాలి…
నాసిరకం నిత్యవసర వస్తువులను విక్రయిస్తున్న సూపర్ మార్కెట్లపై చర్యలు తీసుకోవాలి…
జిల్లాలో బతుకమ్మ ఉత్సవాలను వైభవంగా నిర్వహించాలి కలెక్టర్ ఆదేశాలు జారీ…
సీఐటీయూ ఆధ్వర్యంలో డిపిఓ జిల్లా పంచాయతీ అధికారి కార్యాలయాన్ని ముట్టడించిన గ్రామపంచాయతీ కార్మికులు