టెక్సాస్ కాల్పుల ఘటనలో…. హైదరాబాద్ యువతి దుర్మరణం

 

అలెన్ పట్టణంలోని షాపింగ్ మాల్‌లో శనివారం దుండుగుడి కాల్పులు ఎనిమిది మంది దుర్మరణం, పలువురికి తీవ్ర గాయాలు దుండగుడి తూటాలకు సరూర్ నగర్ యువతి ఐశ్వర్యరెడ్డి బలిటెక్సాస్ రాష్ట్రం అలెన్ పట్టణంలోని షాపింగ్‌ మాల్‌లో శనివారం చోటుచేసుకున్న కాల్పుల్లో ఓ హైదరాబాదీ యువతి దుర్మరణం చెందారు. సరూర్ నగర్‌కు చెందిన తాటికొండ ఐశ్వర్య రెడ్డి (27) దుండగుడి తూటాలకు బలయిపోయారు. కూతురి మరణ వార్త..నర్సిరెడ్డి, అరుణ దంపతులను శోకసంద్రంలోకి నెట్టేసింది. అమెరికాలో స్థిరపడిన తమ కుమార్తె అకాల మరణంతో వారు కన్నీరుమున్నీరవుతున్నారు. అలెన్ పట్టణంలోని ఓ షాపింగ్ మాల్‌లో దుండగుడు విచక్షణా రహితంగా కాల్పులకు తెగబడిన విషయం తెలిసిందే. కారులో మాల్ వద్దకు వచ్చిన అతడు అక్కడున్న వారిపై ఇష్టారీతిన కాల్పులు జరిపాడు. దీంతో, జనం ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పారిపోయారు. అప్పటికే అక్కడ ఉన్న ఓ పోలీసు నిందితుడిపై ఎదురు కాల్పులు జరిపి మట్టుపెట్టాడు. ఈ ఘటనలో 8 మంది మరణించగా పలువురు గాయాలపాలయ్యారు.

Akhand Bhoomi News

error: Content is protected !!