నవీన్ యాదవ్ విజయమే ప్రజా ప్రభుత్వానికి దీవెనలు….
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి….
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; నవంబర్ 5.(అఖండ భూమి న్యూస్) ;
హైదరాబాదులోని జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నవీన్ యాదవ్ విజయం ద్వారా ప్రజలు ప్రజా ప్రభుత్వానికి దీవెనలు అందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు. మంగళవారం రాత్రి జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని రహమత్ నగర్ ఇంచార్జి, ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య నేతృత్వంలో నిర్వహించిన కార్నర్ మీటింగ్ లో పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూగత పది సంవత్సరాలు అధికారంలో ఉన్న బిఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అన్ని రంగాలలో వెనుకబాటుతనానికి గురిచేసిందని ఆరోపించారు. అనాలోచిత నిర్ణయాలతో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి, అభివృద్ధి సంక్షేమలకు పథకాలకు నిధులు లేకుండా చేశారని ఆరోపించారు.
జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలిపించడం ద్వారా ప్రజా ప్రభుత్వానికి ప్రజలు దీవెనలు అందించాలని కోరారు. రహమత్ నగర్ లో పలు బూత్ లల్లో ఇంఛార్జి గా ఉన్న బీర్ల అయిలయ్య సుమారు 1500 మంది తో పెద్ద ర్యాలీ నిర్వహించి, కార్నర్ మీటింగ్ లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు…


