జిల్లా ముఖ్య కేంద్రం మచిలీపట్టణంలో బ్లాక్ లో స్టాంప్ ల విక్రయం.

 

మచిలీపట్నం అఖండ భూమి న్యూస్ : –

మచిలీపట్టణంలో నాన్ జ్యూడిషల్ స్టాంపులు బ్లాక్ లో విక్రయలు జరిపే వారిపై చేర్యలు తీసుకో వలని మచిలీపట్నం బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు లంకిశెట్టి బాలాజి డిమాండ్ చేశారు. సోమవారం మచిలీపట్టణం లో విలేకరుల తో మాట్లాడుతూ 100,50,20,10 రూపాయలు విలువ కలిగిన స్టాంపులు 100 అదనపు సొమ్ము తో అమ్మడం వలన ప్రజలు, అడ్వకేట్స్, కొనుగోలు దారులు, బ్యాంక్ అధికారులు ప్రతి రోజు ఇబ్బందులు పడుతున్నారని బాలాజి అన్నారు. గత 15 సంవత్సరలు గా జిల్లా కోర్టు లో స్టాంప్ వేండర్ లేకపోవడం వలన జిల్లా లో అన్ని ప్రాంతాల నుండి కోర్టు కి వచ్చే కక్షిదారులు త్రీవ ఇబ్బందులు పడుతున్నారు అని అన్నారు.స్టాంప్ల బ్లాక్ విక్రయాల నియంత్రణ పై మరియు జిల్లా కోర్టులో స్టాంప్ వేండర్ కొనసాగింపు పై జిల్లా రిజిస్టర్ స్పందించి ప్రజలు కి కక్షిదారులు కి నాయ్యం చేయాలి అని లంకిశెట్టి బాలాజి కోరారు.

Akhand Bhoomi News

error: Content is protected !!