తాసిల్దార్ కార్యాలయం వద్ద జరిగే ధర్నా జయప్రదం చెయ్యండి.

భూ సమస్యల పైన ఈనెల 23వ తేదీన కొమరాడ తాసిల్దార్ కార్యాలయం వద్ద జరిగే ధర్నా జయప్రదం చేయాలని కోరుతూ కు నేరు సంతలో ప్రసారం నిరసన

పార్వతిపురం మన్యం జిల్లా ప్రతినిధి జూన్ 23( అఖండ భూమి న్యూస్ ) దత్తి మహేశ్వరరావు

కొమరాడ మండలం కోనేరు సంతలో శనివారం 23వ తేదీన భూ సమస్యల పైన కొమరాడ తహసిల్దార్ కార్యాలయం వద్ద జరిగే ధర్నా జయప్రదం చేయాలని కోరుతూ ప్రసారం నిరసన చేయడం జరిగింది ఈ సందర్భంగా ప్రసారాన్ని ఉద్దేశించి సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యుడు కొల్లి సాంబమూర్తి మాట్లాడుతూ గిరిజనులు తమ రాత ముత్తాతల నుండి సాగు చేస్తున్న పోడు భూములకు 2006 అడవి హక్కుల చట్ట ప్రకారం 10 ఎకరాల వరకు పట్టాలు ఇవ్వవలసి ఉండగా ఆ దిశగా పట్టాలు ఇవ్వకుండా పది ఎకరాలు సాగు చేస్తే 8 ఎకరాలకు 8 ఎకరాలు పోడు భూమి సాగుచేత్తే ఆరు ఎకరాలకు ఆరు ఎకరాలు సాగు చేస్తే మూడెకరాలకు మూడు ఎకరాల సాగు చేస్తే రెండు ఎకరాలకు రెండు ఎకరాలు సాగు చేస్తే ఎకరాకి భూమికి పట్టాలు ఇస్తూ అధికారులు చేతులు దులుపుకుంటున్నారని ఇది చాలా అన్యాయం అని అలాగే ఇప్పటికే అడవి శాఖ అధికారులు కూడా గిరిజనులు సాగు చేస్తున్న పోడు భూములకి పట్టాలు ఇచ్చిన నేపథ్యంలో ఆ పట్టాల పైన అడవి శాఖ అధికారులు సంతకాలు కూడా లేని పరిస్థితి ఉందని కాబట్టి ఇలాంటి సందర్భంలో గిరిజనులు సాగు చేస్తున్న భూములకు 10 ఎకరాల వరకు పట్టాలు ఇవ్వాలని అలాగే అన్నదాత సుఖీభవ కింద డబ్బులు కూడా ఇవ్వాలని కోరుతూ ఈ విధంగా పై సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఈనెల 23వ తేదీ సోమవారం కొమరాడ తహసిల్దార్ కార్యాలయం జరిగే ధర్నాలో గిరిజన రైతాంగం పాల్గొని జయప్రదం చేయాలని ఈ సందర్భంగా కోరుతున్నాము ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం నాయకులు చెంబరు వెంకటరావు సుబ్బారావు నాగేశ్వరరావు లక్ష్మణరావు గణేష్ మధు పాల్గొన్నారు

 

కూనేరు సంతలో ప్రసారం చేస్తున్న ఫోటో నాయకులు మాట్లాడుతున్న వీడియో చూడగలరు

Akhand Bhoomi News

error: Content is protected !!