పల్లా సింహాచలంకు నివాళులర్పించిన
పార్వతీపురం నియోజవర్గం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర
పార్వతిపురం మన్యం జిల్లా ప్రతినిధి జూన్ 23 ( అఖండ భూమి న్యూస్ ) దత్తి మహేశ్వరరావు
పార్వతిపురం : తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు తండ్రి స్వర్గీయ సింహాచలంకు ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర ఘన నివాళులర్పించారు. ఇటీవల స్వర్గస్తులైన సింహాచలం దశదిన కర్మ కార్యక్రమం గాజువాక పల్లా నివాసంలో ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా టిడిపి ఎమ్మెల్యేలు,ఎంపీలు,ముఖ్య నాయకులు అందరూ పాల్గొని సింహాచలం కు నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే విజయ్ చంద్ర మాట్లాడుతూ నేటితరం రాజకీయ నాయకులకు పల్లా సింహాచలం స్ఫూర్తిదాయకమని, విశాఖ జిల్లాలో సుదీర్ఘ రాజకీయ నడిపిన ఆయనను ఈ ప్రాంత ప్రజలు ఎంతో గౌరవించే వారిని తెలిపారు. తండ్రి అడుగుజాడల్లోనే నడుస్తున్న టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు పళ్ళ శ్రీనివాసరావు రాష్ట్రంలోని అత్యధిక మెజారిటీ సాధించి తిరుగులేని నాయకుడిగా కొనసాగుతున్నారని పేర్కొన్నారు ఎవరికి ఏ కష్టం వచ్చినా తాను ఉన్నానంటూ భరోసా కల్పించే పల్లా శ్రీనివాసరావును గాజువాక ప్రజలు గుండెల్లో పెట్టుకొని చూసుకుంటున్నారని ఆయన సేవా తత్పరతకు ఇది నిదర్శనం అని కొనియాడారు.
You may also like
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…
దోమకొండలో ఆడుదాం క్రీడా దినోత్సవ వేడుకలు…



