మాదకద్రవ్యాల దుర్వినియోగంపై అవగాహన వారోత్సవాలు…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూన్ 24 (అఖండ భూమి న్యూస్)
కామారెడ్డి జిల్లా సూపర్డెంట్ ఆఫ్ పోలీస్ ఎం రాజేష్ చంద్ర ఐపీఎస్ అధికారి ఆదేశాల మేరకు కామారెడ్డి జిల్లా పోలీస్ కళ్యాణ బృందం ప్రభుత్వ హైస్కూల్ మాచారెడ్డి లో ఎస్సై అనిల్ ఆధ్వర్యంలో మంగళవారం వారోత్సవాల కార్యక్రమం నిర్వహించారు. సైబర్ నిరాహారపై అవగాహన, రోడ్డు ప్రమాదాల నివారణ, డ్రంక్ అండ్ డ్రైవ్ సెల్ఫోన్ డ్రైవింగ్, మాదకద్రవ్యాలు, గంజాయి డ్రగ్స్ సేవించి యువత పెడదారి పడద్దని మహిళలకు చిన్న పిల్లలకు జరుగు అత్య నేరాలు, బాల్య వివాహాలు, చిన్నపిల్లలపై జరిగే నేరాల పట్ల భరోసా టీం అవగాహన కల్పించారు. ఇలాంటి సంఘటనలు పునరావృత్తమైతే 1098 కాల్ చేయాలని మొదలగు అంశాలపై అత్యవసర సమయంలో 100 డైల్ సైబర్ నేరాలు నియంత్రణ తీసుకోవాల్సిన జాగ్రత్తలపై టోల్ ఫ్రీ నెంబర్ 1930 ఉపయోగపడుతుందన్నారు. మానవ అక్రమ రవాణా, సోషల్ మీడియాలో జరుగు నేరాలు సామాజిక అంశముల పైన అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హెడ్ కానిస్టేబుల్ చౌకత్, ప్రధానోపాధ్యాయులు, పోలీసు బృందం హెచ్ సి ఎస్ రామంచ తిరుపతిలు విద్యార్థులు పాల్గొన్నారు.