ఎవరైనా,ఏ వృత్తి వారు అయిన కష్టం తో కాకుండా ఇష్టం తో చెయ్యాలి…

ఎవరైనా,ఏ వృత్తి వారు అయిన కష్టం తో కాకుండా ఇష్టం తో చెయ్యాలి…

లెక్చరర్ ఉమాశేషారావు వైద్య

కామారెడ్డి జిల్లా ప్రతినిధి ; జూన్ 25,(అఖండ భూమి న్యూస్);

 

లోహంతో తయారైన యంత్రా నికి పని చెప్పకుండా కొంతకా లం పక్కన పెడితే తుప్పు పట్టి పనికిరాకుండాపోతుంది.మనిషి కూడా అంతే. అతడు పుట్టిందే పనికోసం. అంతేగానీ ఏమీ చేయకుండా ఊరికే ఉండి చెడిపోవటానికి కాదు. కర్మఫలమే అతడి భావి జీవితాన్ని నిర్ణయిస్తుంది.ఒక జీవి మనుగడకోసం చేసే పోరాటంలో కదలడం అనే ప్రక్రియ ప్రాథమికమైంది, ప్రధానమైంది. కదలికా ఒక రకంగా పనే. ఈ కదలికవల్లే జీవ పరిణామానికి అంకు రారోపణ జరిగి సమస్త జీవకోటి ఆవిర్భవించి ఉంటుంది. ఒక పొట్టిమెడ జంతువుకు ఎప్పటిలాగే ఆకలివేసింది.అందుబాటులోనున్న కొమ్మల ఆకులన్నీ అయిపోయాయి. ఆకులు ఉన్న కొమ్మలేమో అందనంత ఎత్తులోఉన్నాయి.అయినాసరే వాటినీ అందు కోవడానికి తన పొట్టిమెడను సాచడానికి ప్రయత్నించింది. అలా జరిగిన సుదీర్ఘ ప్రయాణంలో ఒకనాడు అంతెత్తు కొమ్మ అందింది, ఆకలి తీరింది. తీరాచూస్తే అది పొడవాటి మెడతో పెద్ద కాళ్లతో జిరాఫీగా రూపాంతరం చెందిం ది.ప్రారంభించిన’పని’విరమించకుండాసాగినందుకుజరిగిందిఏంఒకకొత్తరకంజాతిఆవిర్భవించింది.వెలుగులు పంచడానికి సూర్యుడు తప్ప మరొకటి ఉంటుందని ఊహించామా?

లేదు.కానీ, థామస్ అల్వా ఎడిసన్ విద్యుత్ దీపం కనిపె ట్టాడు. చేపట్టిన ‘పనిపట్ల’అపా ర నమ్మకం, ప్రేమ ఉన్నపుడు ఆశ్చర్యపరిచే ఆవిష్కరణలు చోటుచేసుకుంటాయి.అసాధ్యమనుకున్నవిసుసాధ్యమవుతాయి.ఎవరిలో ఏ మంచి దాగి ఉందో తెలియదు.అదిబయట కు వచ్చి లోక కల్యాణానికి ఉపయోగపడాలి. ప్రతి మనిషి ఈ లోకానికి ఏదో ఒక మంచి చేసి నిష్క్ర మించాలి. అందు కతడు చెయ్యాల్సిందల్లా పని మొదలు పెట్టడమే. ‘భయపడి పని మొదలు పెట్టనివాడు అధముడు. మధ్యలో వదిలే సేవాడు మధ్యముడు.రెట్టింపు ఉత్సాహంతో ముందుకెళ్లి ఫలితం పొందేవాడు ధీరుడు, ఉత్తముడు’ అన్నాడు భర్తృ హరి. బతుకుతెరువు కోసం చేసేదివృత్తి.మానసికానందానికి చేసేది ప్రవృత్తి. వృత్తిని ప్రవృత్తిలా భావించి విధులు నిర్వహించేవారి జీవితం అత్యద్భుతం.పనిచేయనివాడు ఇంటికి దొంగ’ అని సామెత. అలాంటి పనిదొంగలు దేవుడికి నచ్చరు. ‘కార్యం పురుషకారే లక్ష్యం సంపద్యతే’ అంటాడు చాణక్యుడు. అంటే మన వంతు ప్రయత్నం సరిగ్గా చేస్తేకార్యస్వరూపంస్పష్టమవుతుంది. అప్పుడు దాన్ని సాధించడం సులువవుతుంది.

పురుషకారమనువర్తతే దైవమ్’ అన్నదీ చాణక్యుడి మాటే. ప్రయత్నించే పనిచేసే వాడి వెంటే దేవుడుఉంటాడని అర్థం. ఏ పని అన్నది ముఖ్యం కాదు.దాన్నిఎలాచేస్తున్నారన్నదే ప్రధానం. పని చేసేవారికి, స్వీకరించేవారికి మేలు కలగాలి. అందుకే రొట్టెను ఎంతో ప్రేమతో కాల్చితేగానీ తినేవారి ఆకలి తీరదన్నాడు ఖలీల్ జిబ్రాన్. భక్తితో, ప్రేమతో ఎరుకతో పనిచెయ్యడం వల్ల మనసు ఒకేచోట స్థిరంగా నిలు స్తుంది. అప్పుడు జీవితమే ధ్యానం అవుతుంది.

Akhand Bhoomi News

error: Content is protected !!