నేరం ఒప్పుకోవాలని పోలీస్ ల బెదిరింపులు

నేరం ఒప్పుకోవాలని పోలీస్ ల బెదిరింపులు

బెల్లంపల్లి జూన్ 25(అఖండ భూమి న్యూస్):మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని అంబేద్కర్ నగర్ బస్తీలో పోలీసు వాహనాన్ని బస్తీ వాసులు అడ్డుకున్నారు.దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది..వివరాల్లోకి వెళితే కాశిరెడ్డిపల్లి గ్రామ సమీపంలో ఈనెల 22న మధుకర్ అనే వ్యక్తితో గొడవ జరిగిన విషయంలో ముగ్గురు వ్యక్తులు దాడి చేశారు.దీంతో మధుకర్ బెల్లంపల్లి వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది.పోలీసులు ముగ్గురిపై కేసు నమోదు చేసి విచారించారు.ఈ క్రమంలో వారిని బుధవారం బెల్లంపల్లి మేజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టగా రిమాండ్ రిపోర్టు తప్పుడు ఇవ్వడంతో తిరస్కరించిన జడ్జి వారికి స్టేషన్ బెయిల్ మంజూరు చేయమని ఆదేశించారు.కానీ పోలీస్ స్టేషన్ iకు తీసుకెళ్లి స్టేషన్ బెయిల్ ఇవ్వాల్సిన వన్ టౌన్ పోలీసులు పోచమ్మ చెరువు కట్ట మీదుగా తీసుకురాగా సమాచారం తెలిసిన బస్తీ వాసులు,అ ముగ్గురి కుటుంబ సభ్యులు పోలీస్ వాహనాలు అడ్డుకున్నారు.బస్తీ వాసులు ఈ సందర్బంగా మాట్లాడుతూ…పోలీసులు వారిని పోచమ్మ చెరువు సమీపంలో వాహనం దిగి పరిగెత్తాలని చెప్పారని సీన్ రీ కన్స్ట్రక్షన్ పేరిట నిందితులను తుపాకులతో బెదిరిస్తూ నేరం ఒప్పుకోమంటు బలవంతం చేశారని ఆరోపించరన్నారు…

Akhand Bhoomi News

error: Content is protected !!