శాస్త్రీయ విద్యాకోసం నిరంతరం ఉద్యమం…

శాస్త్రీయ విద్యాకోసం నిరంతరం ఉద్యమం…

(ఏ. ఐ . ఎస్. బి) జిల్లా అధ్యక్షులు బైరాపూర్ రవీందర్ గౌడ్.

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూన్ 26 (అఖండ భూమి న్యూస్)

ఉమ్మడి నిజామాబాద్ జిల్లా : విద్యార్థుల శాస్త్రీయ విద్యాకోసం ఎల్లపుడు ఉద్యమం చేస్తామని *(ఏ . ఐ. ఎస్. బి) ఆల్ ఇండియా స్టూడెంట్స్ బ్లాక్ జిల్లా అధ్యక్షులు బైరాపూర్ రవీందర్ గౌడ్ అన్నారు.

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ విద్యారంగంలో వస్తున్న మార్పులనూ విద్యార్థులు గమనించాలని,శాస్త్రీయ విద్యాను సక్రమంగా అందిచడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వలు విఫలం అయ్యాయని ఆయన అన్నారు.ప్రభుత్వ పాఠశాలలో కానీ సంక్షేమ హాస్టలల్లో కానీ కనీస సౌకర్యాలు కల్పించడంలో ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల పట్ల నిర్లక్ష్యం చేస్తుందని ఆయన పేర్కొన్నారు.విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం ఏ మాత్రం పటించుకోవడం లేదని మరియు పేద మధ్య తరగతి వర్గాల విద్యార్థులకూ విద్యాను దూరం చేయాలనే విధంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహారిస్తుందని ఆయన పేర్కొన్నారు.విద్యార్థుల సమస్యలపై మా *(ఏ. ఐ. ఎస్. బి) ఆల్ ఇండియా స్టూడెంట్స్ బ్లాక్ నిరంతరం అలుపెరగని పోరాటాలు చేస్తుందని ఆయన ప్రకటనలో పేర్కొన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!