మున్సిపల్ కమిషనర్ మహేష్ కి సమ్మె నోటీస్ ఇచ్చిన ఎల్లారెడ్డి మున్సిపల్ సిఐటియు అధ్యక్షులు వెంకటేష్

మున్సిపల్ కమిషనర్ మహేష్ కి సమ్మె నోటీస్ ఇచ్చిన ఎల్లారెడ్డి మున్సిపల్ సిఐటియు అధ్యక్షులు వెంకటేష్…

కామారెడ్డి జిల్లా ప్రతినిధి ; జూన్ 26 (అఖండ భూమి న్యూస్)

ఎల్లారెడ్డి మున్సిపల్ కమిషనర్ కు మున్సిపల్ యూనియన్ ( సిఐటియు ) నాయకుల ఆధ్వర్యంలో వచ్చే నెల జూలై 9న దేశవ్యాప్త సమ్మెలో తాము పాల్గొంటున్నామని సమ్మె నోటీసును గురువారం అందించారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ

శతాబ్ద కాలంగా కార్మికవర్గం అనేక త్యాగాలు, పోరాటాలతో సాధించుకున్న 44 కార్మిక చట్టాలలోని 29 కార్మిక చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్లుగా తీసుకొచ్చి వాటి అమలుకు కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తున్నదన్నారు. కోడ్స్ అమలు జరిగితే కార్మిక సంఘాల ఏర్పాటు కష్టతరం అవుతుందనీ, కార్మికులు తమ హక్కులను సాధించుకోలేక తమ శక్తి నిర్వీర్యం చేయబడుతుందన్నారు. ఉద్యోగ భద్రత, ఉపాధి కోల్పోతారు, కార్మిక శాఖ కూడా నిర్వీర్యం చేయబడుతుందన్నారు. దేశంలోని పరిస్థితినంతటినీ సమీక్ష చేసిన కేంద్ర కార్మిక సంఘాలు, స్వతంత్ర ఫెడరేషన్లు, అసోసియేషన్లు 2025 మే 20న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు పిలుపునిచ్చాయి. కానీ 2024 ఏప్రిల్ 22వ పహల్గాంలో జరిగిన ఉగ్రవాద దాడిలో 26 నుంది మరణించడం బాధాకరం. కేంద్ర ప్రభుత్వం మే 7న “ఆపరేషన్ సింధూర్”ను నిర్వహించింది. పాకిస్తాన్ ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసింది. ఈ నేపథ్యంలో దేశ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని 2024 మే 20న జరగాల్సిన సమ్మెను 2025 జూలై 9కి మార్పు చేసింది. జూలై 9న జరిగే సమ్మెను తెలంగాణ రాష్ట్రంలోను అమలు చేసి సమ్మెలో పాల్గొనాలని కార్మిక సంఘాలు నిర్ణయించాయన్నారు. చట్ట వ్యతిరేకమైన 4 లేబర్ కోడ్ల అమలును తక్షణమే రద్దు చేయాలని, స్థానిక సంస్థలకు నిధులు కేటాయించాలని, కనీస వేతనం రూ.26,000/-లు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ 2025 జూలై 9న జరిగే సమ్మెలో తెలంగాణ రాష్ట్రంలోని మున్సిపల్ కార్మికులందరూ పాల్గొంటారని తెలియజేస్తున్నాట్లు ప్రకటించారు. పారిశ్రామిక వివాదాల చట్టం – 1947లోని సెక్షన్-22, సబ్ సెక్షన్(1)ని అనుసరించి ఈ సమ్మె నోటీస్ అందజేస్తున్నాము అన్నారు. తమ డిమాండ్లు అయినా నాలుగు లేబర్ కోడ్ అమలును రద్దు చేయాలి, ప్రభుత్వరంగ సంస్థల ప్రైవేటీకరణ ఆపాలి అని డిమాండ్ చేశారు.

కాంట్రాక్ట్ విధానం రద్దుచేసి, కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ కార్మికులను పర్మినెంట్ చేయాలన్నారు. ఉద్యోగ భద్రత కల్పించి, 8 గంటల పని దినాన్ని అమలు చేయాలన్నారు.

బోనస్, ఇఎస్ఐ చట్టాలలో వేతన సీలింగ్ పరిమితిని పెంచాలన్నారు. తెలంగాణ రాష్ట్ర 2వ పిఆర్సిలో కనీస వేతనం రూ.26,000/-లుగా నిర్ణయించాలి అని డిమాండ్ చేశారు.. మున్సిపల్ శాఖలోని వివిధ విభాగాల్లో పనిచేస్తున్న వారి చదువు, వృత్తి, నైపుణ్యతను గుర్తించి వాటార్ వార్క్స్.ఎలక్ట్ ట్రిషన్ జవాన్లుగా, డ్రైవర్లుగా, శానిటరీ ఇన్స్పెక్టర్లుగా, కంప్యూటర్ ఆపరేటర్లుగా మొదటి ప్రాధాన్యత ఇచ్చి ప్రమోషన్స్ కల్పించాలన్నారు.

కార్మికులు మరణిస్తే దహన (మట్టి) ఖర్చులు నిమిత్తం రూ.30,000/-లు ఇవ్వాలనీ, వయస్సు పైబడిన, అనారోగ్యానికి గురైన, చనిపోయిన కార్మికులు స్థానంలో వారి కుటుంబ సభ్యులకు అవకాశం ఇవ్వాలి. స్వచ్ఛ ఆటో, ఆర్టికల్చర్, హరితహారంలో పనిచేస్తున్న కార్మికులను మున్సిపల్ కార్మికులుగా గుర్తించాలన్నారు. కొత్తగా నియమించుకున్న కార్మికులకు పాత కార్మికులతో సమానంగా రూ.16,600/-ల వేతనం చెల్లించి, ఆదివారాలు, పండుగల సందర్భంగా అందరికీ వర్తించేలా సెలవులు ఇవ్వాలన్నారు. మున్సిపల్ కార్మికులందరికీ డబుల్ బెడ్రూం, ఇందిరమ్మ ఇండ్లు, ఇళ్ళ స్థలాలు కేటాయించి, పెరుగుతున్న పట్టణ విస్తరణకు అనుగుణంగా కొత్త సిబ్బందిని నియమించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డి మున్సిపల్ కార్మిక సంఘం ( సిఐటియు ) అధ్యక్షుడు వేంకటేష్, నాయకులు.మహేందర్. మిజేందర్.వేణుగౌడ్ సాయిలు. డి.కిషన్ తదితరులు పాల్గొన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!