తొమ్మిది రోజుల్లో 9 వేల కోట్లు రైతుల ఖాతాల్లో వేసిన ఘనత రేవంత్ సర్కార్ కే దక్కుతుంది..!
కామారెడ్డి కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ సమావేశంలో షబ్బీర్ అలీ, సురేష్ శెట్కర్..
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూన్ 26 (అఖండ భూమి న్యూస్) :
రైతులకు పంట పెట్టుబడి లో రేవంత్ రెడ్డి సర్కార్ 9 రోజుల్లో తొమ్మిది వేల కోట్ల రూపాయలు జమ చేసిన రికార్డు కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కుతుందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు మహమ్మద్ అలీ షబ్బీర్, ఎంపీ సురేష్ శెట్కర్ అన్నారు. గురువారం
కామారెడ్డి నియోజకవర్గ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం మాచారెడ్డి మండల కేంద్రం లోని బాలాజీ ఫంక్షన్ హాల్లో నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిలుగా ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ ,
ఏఐసీసీ సెక్రటరీ విష్ణు నాథన్. జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు సురేష్ షట్కర్ అబ్జర్వేర్ లు. కత్తి వెంకటస్వామి. సత్యనారాయణ గౌడ్. వేణుగోపాల్ యాదవ్ లు హాజరైనారు.
ఈ సందర్భంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ.
కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పక్షపాతి ప్రభుత్వం అని అన్నారు.
9 రోజుల్లో 9,000 కోట్లు రైతు భరోసా అందించి రికార్డు సాధించిన రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం దక్కుతుందని అన్నారు
ఇల్లు లేని నిరుపేదలకు నియోజకవర్గానికి 3500 ఇంద్రమ్మ ఇల్లు నిర్మిస్తున్నాం అని గుర్తు చేశారు.
పెద్దలు తినే సన్న బియ్యం పేదలకు అందించి వారికి కడుపు నింపుతున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అన్నారు.
బిజెపి వాళ్లు కేంద్ర ప్రభుత్వం సన్నబియ్యం అందిస్తుందని అబద్ధపు ప్రచారం చేస్తున్నారు
బిజెపి అధికారంలో ఉన్న ఏ రాష్ట్రంలో సన్న బియ్యం పంపిణీ చేస్తున్నారు చెప్పాలన్నారు.
బీజేపీ రాష్టానికి చేసిందేమీ లేదు. ప్రజలను రెచ్చగొట్టి అధికారం లోకి రావాలని చుస్తుంది తప్ప ప్రజలకోసం పనిచేయడం లేదన్నారు.
చిన్న చిన్న గొడవలు పక్కన పెట్టీ రాబోయే స్థానిక ఎన్నికల్లో కొత్త పాత నాయకులు సమన్వయం చేసుకొని ముందుకు వెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.
ఇన్ని రోజులు కార్యకర్తలు మన గెలుపు కోసం కష్టపడ్డారు ఇప్పుడు వారి రుణం తీర్చుకోవడానికి సమయం ఆసన్నమైంది వారికోసం పనిచేసి వారిని గెలిపించి నాయకులు గా తీర్చిదిద్దుతాం అన్నారు.
అందరూ పార్టీ సమావేశాలు తప్పకుండా హాజరు కావాలి అన్నారు.
ఏఐసీసీ ఆదేశాలు మేరకు గ్రామ,మండల,బ్లాక్ కమిటీలు ఏర్పాటుకు అందరూ సహకరించాలి అన్నారు.
కార్యకర్తలకు బాధ్యతలు,పదవులు ఇవ్వడమే మా లక్ష్యం అన్నారు.
భూ భారతీ ద్వారా రైతుల సమస్యలు పరిష్కరించడం జరుగుతుందన్నారు.
కెసిఆర్ డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పేరుతో కమిషన్లు తిన్నారు అని ఆరోపించారు.
ఏఐసీసీ సెక్రెటరీ విశ్వనాధం మాట్లాడుతూ.
ఈరోజు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం కుల గణన నిర్వహించి దేశానికే ఆదర్శంగా నిలిచారని అన్నారు.
మోడీ గుజరాత్ రాష్ట్రం దేశము లోనే రోల్ మోడల్ గా చేస్తా అన్నారు. ఎందుకు చేయలేదని గుర్తు చేశారు.
అదే రేవంత్ రెడ్డి దేశంలోనే
తెలంగాణ ను రోల్ మోడల్ గా చేసి
చూపించారు అన్నారు.
కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎన్నో సంస్కరణలు చేశారు. సోనియా గాంధీ నాయకత్వంలో ఉపాధి హామీ పథకాన్ని తీసుకువచ్చారు అని గుర్తు చేశారు.
ఆహార భద్రత కార్డు తీసుకువచ్చి పేదలను ఆదుకున్నా కా కాంగ్రెస్ ప్రభుత్వం అన్నారు.
గిరిజనులకు దళితులకు భూములు అందించారు.
దేశవ్యాప్తంగా 71 వేల కోట్ల రుణమాఫీ అందించారు రైతులకు
చేనేత కార్మికులకు కూడా దేశవ్యాప్తంగా 5000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేశారు.
బిజెపి ప్రభుత్వంలో రైతులపై నల్ల చట్టాలు తీసుకొచ్చి 700 మంది ప్రాణాలు తీసుకున్నారు అని మండిపడ్డారు.
కుల మతాల మధ్య చిచ్చులు పెట్టి రెచ్చగొట్టి అధికారం రావడం తప్ప ప్రజలకు చేసింది ఏమి లేదు అని గుర్తు చేశారు.
ప్రజలు అన్ని గమనించారు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభుత్వం పుంజుకొని అధికారంలోకి వస్తుంది అన్నారు.
జై బాపు జై భీం జై సంవిధాన్ అభియాన్ కార్యక్రమము గ్రామ గ్రామాన తీసుకు వెళ్తున్నారు. ఈ కార్యక్రమాన్ని ఇంకా గట్టిగా ప్రజల్లోకి తీసుకుపోవాలిఅన్నారు.
ఎంపీ ఎంపీ సురేష్ షెట్కర్ మాట్లాడుతూ.
ప్రజలకు సేవ చేసే విధంగా కాంగ్రెస్ నాయకులు లక్ష్యం పెట్టుకోవాలి అన్నారు.
యంత్రాంగం లో జరిగే తప్పులను సరిచేస్తూ ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలి ఉన్నారు.
చిన్న చిన్న గొడవలకు వివాదాలు చేస్తే పార్టీ నుండి సస్పెండ్ చేస్తాము అని హెచ్చరించారు.
కార్యకర్తలు ఐక్యంగా ఉంటే అందరికీ పదవులు ఇచ్చే విధంగా కృషి చేస్తాం అని అన్నారు.
మన వాళ్ళు వేరే వాళ్ళు అనే తేడా లేకుండా ప్రతి పేదవాడికి ఇల్లు అందిస్తాం. ఇల్లు నిర్మాణ పనులను బట్టి నిధులు మంజూరు అవుతాయి అన్నారు.
పార్టీ లేకుంటే కండువా లేకుంటే మనకు అవకాశం ఇచ్చేది ఎవరు అని ప్రశ్నించారు.
రాబోయే ఎన్నికల్లో పార్టీ బలంగా నిలబడాలంటే ముందుగా మన ప్రభుత్వం అధికారంలో ఉండాలి అని మనలో మనం కలిసి ఉండాలి అని అన్నారు.
పాత కొత్త అనే తేడా ఉండకూడదు. పార్టీని బలోపేతం చేయాల్సిన బాధ్యత మనపైన ఉంది అని తెలిపారు.
ఎవరైతే కింది స్థాయిలో పార్టీ జెండా మోసి బలోపేతానికి పనిచేశారో వారిని గుర్తించి వారికి పదవులు
ఇస్తాం అన్నారు.
క్రమశిక్షణ కలిగిన వారికే పార్టీ పదవులు వస్తాయి కాస్త పడాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అనుబంధ సంఘాల ప్రెసిడెంట్లు
మండల అధ్యక్షులు గ్రామ అధ్యక్షులు మాజీ జెడ్పిటిసి లు మాజీ ఎంపీటీసీలు సర్పంచులు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.