శ్రీ వీర హనుమాన్ వెంకటేశ్వర స్వామి ఆలయ కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవం …
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూన్ 26 (అఖండ భూమి న్యూస్);
కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండల కేంద్రంలోని శ్రీ వీర హనుమాన్, వెంకటేశ్వర స్వామి ఆలయ కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవం గురువారం ఘనంగా నిర్వహించారు.
ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి ముఖ్య అతిథులుగా ప్రభుత్వ సలహాదారు మొహమ్మద్ అలీ షబ్బీర్, ఏఐసీసీ సెక్రెటరీ
విష్ణు నాథన్, జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు సురేష్ షట్కర్ లు హాజరైనారు.
మాచారెడ్డి మండల కేంద్రంలోనీ
శ్రీ వీర హనుమాన్ వెంకటేశ్వర స్వామి దేవాలయ కమిటీ నూతన చైర్మన్ పాలకవర్గ సభ్యులతో షబ్బీర్అలీ గారి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేయించారు.
శ్రీ వీరహనుమాన్ వెంకటేశ్వర స్వామి ఆలయ కమిటీ చైర్మన్ గా శేణిశెట్టి రాజమౌళి. డైరెక్టర్లుగా. ఏ .రాజేశం., భుక్య శాంతి, సత్యనారాయణ., టి దేవయ్యలను , ప్రమాణ స్వీకారం చేయించారు.
ఈ సందర్భంగా ప్రభుత్వ సలహాలు మహమ్మద్ అలీ షబ్బీర్ గారు మాట్లాడుతూ
వీరహనుమాన్ వెంకటేశ్వర స్వామి ఆలయం చాలా పురాతన మైనది మరియు మహిమలు గలదని అన్నారు
నాకు ఆలయ అభివృద్ధి చేసే అవకాశం కల్పించిన స్వామివారుకున్ రుణపడి ఉంటారని అన్నారు.
ఆలయ కమిటీ సభ్యులు నిజాయితీగా స్వామిన్వారి ఆలయ అభివృద్ధికి కృషి చేయాలని మీకు ఈ అవకాశం దొరకడం చాలా గొప్ప విషయమని స్వామి వారి కరుణతోనే మీకు ఈ పదవులు వచ్చాయని దాన్ని అభివృద్ధితో సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.
కోరికలు కోరుకున్న వారికి కోరికలు నెరవేరుతాయని
ఆలయ దర్శనం చేసుకుంటే మనసు ఎంతో ప్రశాంతంగా ఉంటుందని అన్నారు.
ఆలయ అభివృద్ధికి నా వంతు శాయశక్తుల కృషి చేస్తాను అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.