రక్తదాన శిబిరం విజయవంతం..
డాక్టర్ బాలు ను ప్రత్యేకంగా అభినందించిన ఉప్పల శ్రీనివాస్ గుప్తా..
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూన్ 29 (అఖండ భూమి వెబ్ న్యూస్ ) :
ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ ఐవిఎఫ్ 12 సంవత్సరాల వార్షికోత్సవ వేడుకల సందర్భంగా ఐవిఎఫ్ సికింద్రాబాద్ జోన్ ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా రక్తదాన శిబిరం విజయవంతం కావడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన ఐవిఎఫ్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉప్పల శ్రీనివాస్ గుప్త,లష్కర్ జిల్లా సాధన సమితి అధ్యక్షులు గుర్రం పవన్ కుమార్ గౌడ్ లు మాట్లాడుతూ తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల కోసం రక్తదాన శిబిరం ఏర్పాటు చేసిన బెలిదె రవికుమార్ మరియు సభ్యులందరినీ అభినందించడం జరిగింది.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఐవిఎఫ్ 12వ వార్షికోత్సవం సందర్భంగా విజయవంతంగా రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేస్తున్న ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ బాలు ను అభినందించడం జరిగింది.మూడు వేల యూనిట్ల రక్తాన్ని తలసేమియా చిన్నారుల కోసం అందజేస్తామని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఐవిఎఫ్ రాష్ట్ర కమిటీ నాయకులు పబ్బ చంద్రశేఖర్,కటకం శ్రీనివాస్,డాక్టర్ నీల శ్రీధర్,ఐవిఎఫ్ సికింద్రాబాద్ జోన్ నాయకులు తిరువీధి ప్రభాకర్,నాగమల్ల సురేందర్ గుండా శ్రీనివాస్,కూనిశెట్టి వెంకటేశ్వరరావు,కొమ్మూరి భాస్కర్,బూశెట్టి శ్రీనివాస్,ఉప్పల వేణుగోపాల్,కోలా సురేష్,గంగాధర్ లు పాల్గొన్నారు.