2000, 2001 పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూన్ 29 (అఖండ భూమి న్యూస్)
కామారెడ్డి జిల్లా పాల్వంచ మండలం పరిదీ పేట్ గ్రామంలోని జిల్లా పరిషత్ పాఠశాల కు చెందిన 2000, 2001 సంవత్సరానికి చెందిన పదో తరగతి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం ఘనంగా నిర్వహించారు. అప్పటి పూర్వ విద్యార్థులు జిల్లా పరిషత్ పాఠశాలలో చదువుకున్న జ్ఞాపకాలను అప్పటి తోటి విద్యార్థులతో గుర్తు చేసుకున్నారు. విద్యాభ్యాసం చేసే చిన్ననాటి జ్ఞాపకాలను వేసుకుంటూ ఒకరికొకరు పలకరించుకున్నారు. పూర్వ విద్యార్థులు ప్రస్తుతం వారు చేస్తున్న పనులతో పాటు వారి కుటుంబాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. మొత్తానికి ఒకరికొకరు క్షేమాలను తెలుసుకొని విందుల్లో పాల్గొన్నారు. అనంతరం పూర్వ ఉపధ్యాయులు ను శాలువలతో, జ్ఞాపికలను అందించి ఘనంగా సత్కరించుకున్నారు. ఈ కార్యక్రమంలో పూర్వ ఉపాధ్యాయులు టి గణేష్, ఐరన్ నర్సయ్య కొంగల వెంకటి సిహెచ్ రాములు టి రామిరెడ్డి అటెండర్ మల్లేశం పూర్వ విద్యార్థులు కోలా బాలా గౌడ్ పంపరి నాగరాజ్ సంటోల్ల రాజేష్ మిరుదొడ్డి సత్యం ఎస్.కె ఇమామ్ సిహెచ్ రమేష్ డి రాజనర్స్ ఎస్ కె నజీర్ ఎస్ కే షాదుల్ ఎన్ నరేష్ రెడ్డి సురేందర్ రెడ్డి రాజిరెడ్డి కే ఆంజనేయులు జి ఆంజనేయులు, శ్రీకాంత్ సంతోష్ రెడ్డి ఆర్ నర్సింలు బి మధు రజని అంజమ్మ మంజుల వెంకటలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.