పూర్వ విద్యార్థులకు ఆత్మీయ సమ్మేళనంతో అపూర్వ స్పందన…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూన్ 29 (అఖండ భూమి న్యూస్)
కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ పాఠశాల చెంది 1984, 85 సంవత్సరానికి చెందిన 10వ తరగతి పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఆదివారం ఘనంగా నిర్వహించారు. పూర్వ విద్యార్థులు ప్రస్తుత నిర్వహిస్తున్న విధులతోపాటు వారి కుటుంబాల ప్రస్తుత నిర్వహణ తదితరాంశాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. పూర్వ విద్యార్థుల అపూర్వ కలయిక ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొని జ్ఞాపికలను అందజేసుకున్నారు. అప్పటి ఉపాధ్యాయులను వారిని సన్మానించి జ్ఞాపికలను అందించారు. అనంతరం సమావేశం ఏర్పాటు చేసుకొని తిరిగి పరిచయాలు చేసుకున్నారు. నాటి గురువులను సన్మానించి జ్ఞాపికలను అందజేశారు. అనంతరం విందులో పాల్గొని సంతోషంగా గడిపారు. కార్యక్రమంలో నాటి పూర్వ విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.