దోమకొండలో భూలక్ష్మి, మహాలక్ష్మి దేవి లకు బోనాల సమర్పణ…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూన్ 29 (అఖండ భూమి న్యూస్)
కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రంలో శ్రీ భూలక్ష్మి, మహాలక్ష్మి దేవి లకు ఆదివారం బోనాలు సమర్పించారు. మండల కేంద్రంలో ని సమాధి గడ్డ ప్రాంతంలో ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో భూలక్ష్మి మహాలక్ష్మి దేవి లకు ప్రతి ఏటా మాదిరిగా ఈ సంవత్సరం బోనాలను సమర్పించారు. అమ్మవారికి అభిషేకాలు, హారతి, మంత్రపుష్పం, తీర్థ ప్రసాద వినియోగాలు నిర్వహించారు. ఆలయం కు వచ్చిన భక్తులకు పూర్తిస్థాయిలో సౌకర్యాలు కల్పించారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం సభ్యులు, దోమకొండ ప్రజలు, గ్రామస్తులు పాల్గొన్నారు.