కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి కామారెడ్డి జిల్లా పర్యటన…

నేడు రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి కామారెడ్డి జిల్లా పర్యటన…

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూలై 6 (అఖండ భూమి న్యూస్);

కామారెడ్డి జిల్లాలో సోమవారం రాష్ట్ర రోడ్డు భవనాలు, సినీ ఆటో గ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి జిల్లా పర్యటన ఖరారు అయింది.

 

1. ఉదయం 11:40 గంటలకు జుక్కల్ నియోజకవర్గం మద్దెలచెరువు – పిట్లం రోడ్,తిమ్మ నగర్ వద్ద 4.86 కోట్ల వ్యయంతో నూతనంగా నిర్మించిన హై లెవల్ బ్రిడ్జ్ ను ప్రారంభిస్తారు.

 

2. మధ్యాహ్నం 12:10 గంటలకు బిచ్కుంద నుండి డోంగ్లి వరకు 13.20 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించే రోడ్డు పనులకు శంకుస్థాపన చేస్తారు.

 

3. మధ్యాహ్నం 12:30 గంటలకు స్థానిక ఎమ్మెల్యే లక్ష్మికాంత రావు,జిల్లా ప్రజా ప్రతినిధులు, సీనియర్ నాయకులతో కలిసి పబ్లిక్ మీటింగ్ లో పాల్గొంటారు.

 

4. మధ్యాహ్నం 1గంటలకు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పలు అభివృద్ధి,సంక్షేమ పథకాలపై జిల్లా కలెక్టర్,పలువురు జిల్లా ఉన్నతాధికారుతో జుక్కల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహిస్తారు.

 

5. మధ్యాహ్నం 1:45 గంటలకు ఇటీవల అకాలమరణం చెందిన సీనియర్ జర్నలిస్ట్ దత్తు రెడ్డి కుటుంబాన్ని పరామర్శిస్తారు.

Akhand Bhoomi News

error: Content is protected !!