“ఆర్మూర్ ఆర్టీసీ లో అడిషనల్ డిపో క్లర్క్ చేతివాటం..
-ఫోన్ పే చేస్తే స్పెషల్ ఆఫ్ డ్యూటీలు..?
-లేదంటే డే అవుట్ డ్యూటీలు..?
నిజామాబాద్ జిల్లా ప్రతినిధి మనోహర్ జులై 06: (అఖండ భూమి న్యూస్) ఆర్మూర్, ఆర్టీసీ డిపోలో అసిస్టెంట్ డిపో క్లర్క్ (ఏడిసీ) బుకింగ్ డ్యూటీ వేయడంలో తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నట్లు ఆలస్యంగా తెలిసింది. ఫోన్ పే తన ఫోనుకు కాకుండా, తన బంధువుల ఫోనుకు ఫోన్ పే చేయించుకుని వారికి అనుకూలమైన స్పెషల్ హాఫ్ డ్యూటీలు వేసి, ఫోన్ పే చేయని వారికి వారం రోజులపాటు డే అవుట్ డ్యూటీలు వేస్తూ ఇష్ట రాజ్యాంగ వ్యవహరిస్తున్నట్లు సమాచారం..? ఈ విషయంపై ఎన్నోసార్లు వెల్ఫేర్ బోర్డు బాక్స్ ద్వారా, వెల్ఫేర్ బోర్డు మెంబర్ కు, డిపో మేనేజర్ కు తెలిపిన ఎలాంటి న్యాయం జరగడం లేదని బయట చెప్పుకుంటున్నట్లు తెలిసింది. వారం రోజులపాటు డే అవుట్ 10 నుండి 12 గంటలు డ్యూటీలు చేసి అలసిపోయి పోతున్నామని, ప్రతిరోజు ఒక డే అవుట్, ఒక స్పెషల్ ఆఫ్ వేయించి మా ఆరోగ్యాలను రక్షించి మాకు సర్వీస్ ఉన్నంతవరకు మా సేవలను ఆర్టీసీ సంస్థకు వినియోగించుకోని న్యాయం చేయాలని, రీజినల్ మేనేజర్ (ఆర్ ఎం) సోమవారం ఫిర్యాదు చేయనున్నట్లు విశ్వసనీయ సమాచారం..