10000 ప్రాథమిక పాఠశాలల్లో హెడ్మాస్టర్ పోస్టులు వెంటనే మంజూరు చేయాలి

10000 ప్రాథమిక పాఠశాలల్లో హెడ్మాస్టర్ పోస్టులు వెంటనే మంజూరు చేయాలి

– టి పి టి ఎఫ్ కామారెడ్డి జిల్లా పిఎస్ హెచ్ఎం పోస్టుకు బీఈడీ, బిఈడి సమాన అర్హతగా పరిగణించాలి

– ప్రాథమిక పాఠశాలలో రేషనలైజేషన్ నిబంధనలు మార్చాలి

– టి పి టి ఎఫ్ కామారెడ్డి జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చింతల లింగం, చింతల శ్రీనివాస్ రెడ్డి

 

– కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూలై 9 (అఖండ భూమి న్యూస్);

 

టి పి టి ఎఫ్ కామారెడ్డి జిల్లా కమిటీ సమావేశం బుధవారం వశిష్ఠ డిగ్రీ కాలేజీలో నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షులు చింతల లింగం మాట్లాడుతూ ప్రభుత్వం ఇదివరకే ప్రకటించిన 10 వేల పిఎస్ హెచ్ఎం పోస్టులు మంజూరు చేసి ప్రతి ప్రాథమిక పాఠశాలకు ఒక ప్రధానోపాధ్యాయ పోస్టు ఇవ్వాలని అన్నారు. గత ప్రభుత్వం ప్రకటించిన పదివేల పోస్టులు ఇంతవరకు మంజూరు చేయలేదని, వాటిని వెంటనే మంజూరు చేసి ప్రాథమిక పాఠశాలను అభివృద్ధి చేయాలని, ముఖ్యమంత్రి ఆకాంక్షలకు అనుగుణంగా పాఠశాలలను తీర్చిదిద్దాలని డిమాండ్ చేశారు. ప్రాథమిక పాఠశాలలో విద్య బాగుంటేనే విద్యా రంగం అభివృద్ధి చెందుతుందని, ప్రాథమిక స్థాయిని నిర్లక్ష్యం చేయడం వల్లనే ప్రభుత్వ విద్యా వ్యవస్థ తీవ్రమైన సమస్యలను ఎదుర్కొంటుందని అన్నారు. దీంతోపాటు బిఈడి అర్హత కలిగిన ఎస్జిటి ఉపాధ్యాయులకు ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయ పోస్టు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అంతే కాకుండా ప్రాథమిక పాఠశాల లో రెగ్యులరైజేషన్ పేరుతో ప్రాథమిక పాఠశాలను మూసివేసే కుట్ర జరుగుతుందని, 60 మంది విద్యార్థులకు కూడా ఇద్దరు ఉపాధ్యాయులను కేటాయించడం వల్ల విద్యార్థుల అభ్యసన తీవ్రంగా నష్టపోతుందని అందువల్ల ప్రభుత్వం 20 మంది విద్యార్థులు ఉన్న పాఠశాలకు ఇద్దరు ఉపాధ్యాయులను కేటాయించాలన్నారు. 20 నుంచి 40 మంది విద్యార్థులు ఉంటే ముగ్గురు ఉపాధ్యాయులను 40 విద్యార్థుల పైన ప్రతి 20 మంది విద్యార్థులకు ఒక ఉపాధ్యాయుడిని కేటాయించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా ప్రతి పాఠశాలలో కనీసం ఇద్దరు ఉపాధ్యాయులు ఉండే విధంగా నిబంధనలను సవరించాలని వారు పేర్కొన్నారూ. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి చింతల శ్రీనివాస్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు టి వాసు,లక్ష్మి నరేందర్, విజయ శ్రీ, నాగభూషణం ఫెడరేషన్ సీనియర్ నాయకులు రామ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!