యువత జనాభావృద్ధి , పర్యావసానలపై దృష్టి సారించాలి …
_ తెలంగాణ యూనివర్సిటీ ప్రిన్సిపాల్ డా.సుధాకర్ గౌడ్
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూలై 11 (అఖండ భూమి న్యూస్);
నేటి యువత జనాభా పెరుగుదల వల్ల ఏర్పడుతున్న పరిణామాలపై దృష్టి సారించాలని, సరైన కుటుంబాన్ని ఏర్పరచుకోవాలని సౌత్ క్యాంపస్ ప్రిన్సిపల్ డా.సుధాకర్ గౌడ్ పిలుపునిచ్చారు.
ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా సౌత్ క్యాంపస్ లో మేరా భారత్ ,సోషల్ వర్క్ విభాగం ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు.
ఈ సందర్భంగా సౌత్ క్యాంపస్ ప్రిన్సిపల్ డాక్టర్ సుధాకర్ గౌడ్, ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. ఆయన మాట్లాడుతూ. 1987 జులై 11వ తేదీ నుంచి ప్రపంచ జనాభా ఐదు బిలియన్లు అయిన సందర్భంగా ఈ ప్రపంచ జనాభా దినోత్సవం యుఎన్ఓ పిలుపుమేరకు జరుపుతున్నారని అన్నారు. నేడు ప్రపంచ జనాభా 8.3 బిలియన్లకు చేరిందన్నారు. అందువల్ల జనాభా పెరుగుదల వల్ల ఒకవైపు నష్టం, మరొకవైపు మానవ వనరుల అభివృద్ధి జరుగుతుందని అన్నారు. ఈ సంవత్సరం ప్రపంచ జనాభా దినోత్సవం థీమ్ ” యువత న్యాయమైన,ఆశాజనకమైన ప్రపంచంలో వారు కోరుకున్న కుటుంబాన్ని సృష్టించుకునే అధికారాన్ని కల్పించటం” అన్నారు.
ఈ థీమ్ ప్రకారం యువత సరైన సమయంలో ఒక కుటుంబాన్ని సృష్టించుకోవాలని అన్నారు. భారత దేశంలో యువత ఎక్కువ ఉన్నారు కాబట్టి నైపుణ్యాలను పెంచుకొని ఉద్యోగాలను పొందాలని పిలుపునిచ్చారు. జనాభా పెరుగుదలను అరికట్టడం కూడా మన బాధ్యతగా ఉండాలని అన్నారు. ప్రపంచ జనాభా దినోత్సవం ప్రాముఖ్యతను విద్యార్థులు ప్రచారం చెయ్యాలని పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ డా.రాజేశ్వరి, సోషల్ వర్క్ విభాగం అధ్యక్షుడు డా.అంజయ్య బందెల, ఫిజిక్స్ విభాగం అధ్యక్షుడు డా.మోహన్ బాబు,డా.సబిత,డా.హరిత బాయ్స్ హాస్టల్ వార్డెన్ డా. యాలాద్రి, apro డా.సరిత పిట్ల,డా.నర్సయ్య,డా.రమాదేవి,దిలీప్,డా.వెంకట్ రెడ్డి,డా.సంతోష్ గౌడ్ మరియు విద్యార్థులు పాల్గొన్నారు.