ఆదివారం దోమకొండకు షబ్బీర్ అలీ రాక…

నేడు దోమకొండకు షబ్బీర్ అలీ రాక…

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూలై 12 (అఖండ భూమి న్యూస్);

దోమకొండ మండల కేంద్రంలో ఆదివారం జరిగే మహంకాళి బోనాల జాతరకు జరిగే ఉత్సవాలకు హాజరైతునట్లు దోమకొండ గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సీతారాం మధు ముదిరాజ్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రతి ఏటా సికింద్రాబాద్ లో జరిగే మహంకాళి బోనాల జాతర రోజునే దోమకొండలో ఉజ్జయిని మహంకాళి (చాముండేశ్వరి) బోనాల ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ ఉత్సవాలకు రాష్ట్ర ప్రభుత్వ సహాయారుడు షబ్బీర్ అలీ ముఖ్య అతిథులుగా హాజరై అమ్మవారిని దర్శించుకుంటారని అన్నారు. ఈ ఉత్సవాలకు దోమకొండ పట్టణ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు భారీ సంఖ్యలో హాజరుకావాలని ఆయన ప్రకటనలో పేర్కొన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!