మరో కొన్ని గంటలలో ఇంటర్ ఫలితాలు … సబితా ఇంద్రారెడ్డి

 

హైదరాబాద్‌  అఖండ భూమి వెబ్ న్యూస్ :

తెలంగాణలో లక్షల మంది విద్యార్థులు, తల్లిదండ్రులు ఉత్కంఠగా ఎదురుచూస్తోన్న ఇంటర్‌ పరీక్షల ఫలితాల విడుదలకు రంగం సిద్ధమైంది. ప్రథమ, ద్వితీయ ఇంటర్‌ ఫలితాలను మే 9న (మంగళవారం) విడుదల చేసేందుకు ఇంటర్‌ బోర్డు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ ఫలితాలను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి నాంపల్లిలోని ఇంటర్‌ బోర్డు కార్యాలయంలో విడుదల చేయనున్నారు. ఫలితాలు విడుదలైన వెంటనే విద్యార్థులు tsbie.cgg.gov.in వెబ్‌సైట్‌లలో చెక్‌ చేసుకోవచ్చు. మార్చి 15 నుంచి ఏప్రిల్‌ 4వరకు జరిగిన ఇంటర్మీడియట్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సర పరీక్షలకు దాదాపు 9 లక్షల మందికి పైగా విద్యార్థులు హాజరైన విషయం తెలిసిందే.

Akhand Bhoomi News

error: Content is protected !!