
బిబ్బుబిక్కుమంటున్న అటవీప్రాతంలో నివసిస్తున్న గిరిజనులు. ఏ క్షణాన ఏమి జరుగుతుందో అన్న భయాందోళన
అల్లూరి జిల్లా గూడెం కొత్త వీధి అఖండ భూమి వెబ్ న్యూస్ :
దండకారణ్య అటవీ ప్రాంతాల్లో వరస ఎన్ కౌంటర్లు కలకలం సృష్టిస్తున్నాయి. ఆదివారం తెల్లవారు జామున తెలంగాణ, చత్తీస్ గడ్ అటవీ ప్రాంతంలో ఎదురు కాల్పులు జరగగా తాజాగా సుక్మా జిల్లా అటవీ ప్రాంతంలో మరో ఘటన చోటు చేసుకుంది. దీంతో గోదావరి, ఇంద్రావతి నది పరివాహక ప్రాంతాల దండకారణ్య అటవీ ప్రాంతం ఉలిక్కి పడుతోంది. ఓ వైపున బూట్ల చప్పుళ్లు… మరో వైపున కాల్పుల మోతలతో ప్రశాంతంగా ఉన్న సరిహద్దు అడవుల్లో అలజడి మొదలైంది. దీంతో సరిహద్దు అటవీప్రాతంలో నివసిస్తున్న గిరిజనులు బిక్కుబిక్కుమంటూ ఎప్పుడు ఏమ్ జరుగుతుందో నని ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకొని బ్రతుకుతున్నారు. భద్రాద్రి కొత్త గూడెం జిల్లా చర్ల మండలం పుట్టపాడు అటవీ ప్రాంతంలో ఆదివారం తెల్లవారు జామున జరిగిన ఎన్ కౌంటర్ లో ఎల్డీఎస్ కమాండ్ ఎర్రయ్య అలియాస్ రాజేష్, మిలీషియా కమాండర్ నందాలు చనిపోయారు. ఘటనా స్థలం నుండి పోలీసులు మందుగుండి సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. సోమవారం తెల్లవారు జామున చత్తీస్ గడ్ లోని సుక్మా జిల్లా దంతేషపురం అటవీ ప్రాంతంలో పోలీసు బలగాలకు, మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో గొల్లపల్లి ఎల్డీఎస్ కమాండర్, మడ్కం ఎర్ర, దళ సభ్యురాలు పోడియం భీమేలు చనిపోయినట్టు సుక్మా జిల్లా పోలీసు అధికారులు ప్రకటించారు. ఘటనా స్థలం నుండి పెద్ద మొత్తంలో ఆయుధాలు, నక్సల్స్ వినియోగించే వస్తువులను స్వాధీనం చేసుకున్నట్టు పోలీసు వర్గాలు తెలిపాయి.
You may also like
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…
దోమకొండలో ఆడుదాం క్రీడా దినోత్సవ వేడుకలు…


