ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకుంటుంటే, కాంగ్రెస్ ప్రభుత్వం సంబరాలు చేసుకుంటుంది…
మంద రవికుమార్ ఆటో యూనియన్ల జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూలై 24 (అఖండ భూమి న్యూస్);
2023 ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ ఆటో సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని,సంవత్సరానికి 12 వేల రూపాయలు జీవనభృతి కల్పిస్తామని, సామాజిక ఆటో భద్రతను కల్పిస్తామని నమ్మబలికి అధికారంలోకి వచ్చి ఆటో డ్రైవర్లను నిండా ముంచిందని ఆటో యూనియన్ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు మంద రవికుమార్ అన్నారు. మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఆర్టీసీ ఫ్రీ కల్పించడంతో ఆటో డ్రైవర్లు ఉపాధిని కోల్పోయి ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్రంలో 87 మంది ఆటో డ్రైవర్ ఆత్మహత్యలు చేసుకున్నారని వారి సమాధుల పునాదుల మీద ఆర్టీసీలో సంబరాలు చేసుకుంటున్నారని ఆరోపించారు. కామారెడ్డి లోని ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంద రవికుమార్ మాట్లాడుతూ అన్నారు.
స్థానిక ఎన్నికల ముందు మంచిర్యాలలో ఆటోల బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నామని ఆ సభతో కాంగ్రెస్ ప్రభుత్వంతో తాడోపేడో తేల్చుకుంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో బుగుడాల సాయిలు, ఉమార్ ఖాన్, ఆల్తఫా,ఎల్ తదితరులు పాల్గొన్నారు.