లోకసభలో కొత్త అటెండెన్స్ వ్యవస్థ ..!
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూలై 24 (అఖండ భూమి న్యూస్);
పార్లమెంట్లో ఎంపీలకు డిజిటల్ అటెండెన్స్ వ్యవస్థ అందుబాటులోకి రానుంది. ఈ కొత్త వ్యవస్థను ప్రవేశపెట్టనున్నట్లు లోక సభ ప్రకటించింది. ఎంపీలకు కేటాయించిన సీట్లలో నుంచి ఎలక్ట్రానిక్ అటెండెన్స్ నమోదు కానున్నాయి. జూలై 21 నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో డిజిటల్ అటెండెన్స్ అమలు చేయడానికి పూర్తి ఏర్పాటు చేసినట్లు తెలిపింది.