దోమకొండ గ్రామ అభివృద్ధి ట్రస్ట్ ఆధ్వర్యంలో వైద్య శిబిరం…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూలై 27 (అఖండ భూమి న్యూస్);
కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రంలోని గడికోట గ్రామ అభివృద్ధి అప్పులో ఆసుపత్రి ఆధ్వర్యంలో ఆదివారం వైద్య శిబిరం నిర్వహించారు. దోమకొండలో ఉన్న వృద్ధులకు సుమారు 100 మందికి పైగా వృద్ధులు, షుగర్, బిపి ఇతర రోగాల బారిన పాడిన రోగులకు శిబిరం నిర్వహించి వైద్యం అందించారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బందితోపాటు ట్రస్ట్ ప్రతినిధి బాబ్జి, నేతుల గణేష్ యాదవ్, మద్ద నవీన్, కల్పన, వెంకటలక్ష్మిలు పాల్గొన్నారు.