బిబిపేట్ వాసవి క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత నేత్ర పరీక్షల శిబిరం…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూలై 27 (అఖండ భూమి న్యూస్);
కామారెడ్డి జిల్లా బీబీపేట వాసవి క్లబ్ ఆవరణలో “ఉచిత నేత్ర పరీక్ష శిబిరము ఆదివారం నిర్వహించారు. సిద్దిపేట చెందిన కృష్ణ సాయి ఐ హాస్పిటల్ , సెంటర్ ఫర్ సైట్ ఆధ్వర్యంలో బిబిపేట గ్రామానికి చెందిన డాక్టర్ శ్రీ బచ్చు కృష్ణమూర్తి , డాక్టర్ శ్రీ పెద్ది శ్రీపతి గారి ఆధ్వర్యంలో 162 మందికి కంటి పరీక్షలు జరిపి 35 మంది శస్త్ర చికిత్సకు అవసరమని తెలిపినారు.
శస్త్ర చికిత్స అవసరమైన వారికి ఉచితముగా సిద్దిపేట లో గల కృష్ణ సాయి హాస్పిటల్ నందు చేయుదురు,
ఈ కార్యక్రమంలో సెంటర్ ఫర్ సైట్ నిర్వాహకులు హరీష్ , వాసవి క్లబ్ అధ్యక్షుడు నాగభూషణం, కోశాధికారి రెడ్డి శెట్టి నాగభూషణం, మాజీ డిప్యూటీ గవర్నర్ విశ్వ ప్రసాద్, అంతర్జాతీయ కోఆర్డినేటర్ భాశెట్టి నాగేశ్వర్, నిలబైరయ్య, గాంధారి సిద్ధరాములు, పెద్ది నాగేశ్వర్, హరి ప్రసాద్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.