కామారెడ్డి జిల్లా ఆటో జేఏసీ అధ్యక్షునిగా ఉమర్ ఖాన్…

కామారెడ్డి జిల్లా ఆటో జేఏసీ అధ్యక్షునిగా ఉమర్ ఖాన్…

– ఆటో జేఏసీ యూనియన్ బలోపేతం కోసమే నియామకం ..

– రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి బుగుడాల సాయిలు..

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూలై 27 (అఖండ భూమి న్యూస్);

కామారెడ్డిలో ఆటో జేఏసీ యూనియన్ బలోపేతం చేసేందుకు జిల్లా కమిటీని మార్చడం జరుగుతుందని రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి ఒక ప్రకటనలో తెలిపారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలానికి చెందిన ఉమర్ ఖాన్ ను తెలంగాణ రాష్ట్ర ఆటో యూనియన్ల జేఏసీ నుండి కామారెడ్డి జిల్లా అధ్యక్షునిగా నియమిస్తున్నట్లు ఆటో జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు మంద రవికుమార్ ఆదేశాలు జారీ చేశారని రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి బుగుడాల సాయిలు అన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో రెండు రోజుల క్రితం నిర్వహించిన సమావేశంలో సమావేశంలో ఇట్టి నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. త్వరలోనే కామారెడ్డి జిల్లాకు పూర్తిస్థాయిలో కమిటీని ఏర్పాటు చేస్తాం అన్నారు. కామారెడ్డి జిల్లాలోని గ్రామ, మండల, జిల్లా పూర్తి కమిటీల నిర్మాణాలు చేసి భవిష్యత్తు పోరాటాలకు ఆటో డ్రైవర్లను సిద్ధం చేయాలని, రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు కట్టుబడి ఉండాలని నియామక ఉత్తర్వులో నాయకులు ఉమర్ ఖాన్ ను ఆదేశించినట్లు సాయిలు తెలిపారు.

Akhand Bhoomi News

error: Content is protected !!