కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడటంలో గౌడ బిడ్డల భాగస్వామ్యం ఉందనే విషయాన్ని మర్చిపోవద్దు…
.. జై గౌడ ఉద్యమం కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు రంగోల్ల మురళి గౌడ్
గౌడ కులస్తులను కల్తీకల్లు పేరిట వేధిస్తే ఊరుకోం ..
ప్రతి గ్రామంలో గౌడ కులస్తులకు 5 ఎకరాలు కేటాయించాలి ..
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూలై 27 (అఖండ భూమి న్యూస్);
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడటంలో గౌడ బిడ్డల భాగస్వామ్యం ఉందనే విషయాన్ని మర్చిపోవద్దు అని జై గౌడ ఉద్యమం కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు రంగోల్ల మురళి గౌడ్ అన్నారు. గౌడ కులస్తులను కల్తీకల్లు పేరిట వేధిస్తే ఊరుకోం హెచ్చరించారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టిన విధంగా తెలంగాణ రాష్ట్రంలోని అన్ని గ్రామాలకు ఐదు ఎకరాల ప్రభుత్వ భూమిని కేటాయించాలని అయన ప్రభుత్వాన్ని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడటంలో గౌడ బిడ్డల భాగస్వామ్యం ఉందనే విషయాన్ని మరిచిపోవద్దన్నారు. కామారెడ్డి పట్టణంలో విడుదల చేసిన ఓ ప్రకటనలో ఎక్సైజ్ అధికారుల తీరును నిరసిస్తూ ఓ ప్రకటన విడుదల చేశారు. కల్తీ కళ్ళు పేరిట వేదిస్తే ఊరుకోమని ఆయన హెచ్చరించారు.కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్సైజ్ అధికారులతో ఎన్నడూ లేని విధంగా కల్తీ కల్లు పేరిట దాడులు చేయడం తగదని హెచ్చరించారు. కల్తీ కల్లు పేరిట గౌడ వృత్తిని నిర్వీర్యం చేసి లిక్కర్ మాఫియా కు కాంగ్రెస్ ప్రభుత్వం సహకరిస్తుందన్నారు. ఈ విధంగా దాడులుచేస్తే గౌడబిడ్డలు చూస్తూ ఊరుకోరని తిరుగుబాటుకు సిద్ధమవుతారని హెచ్చరించారు.
You may also like
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…
దోమకొండలో ఆడుదాం క్రీడా దినోత్సవ వేడుకలు…



