అవతారం అంటే ఏమిటి?దశావతారాలు …

అవతారం అంటే ఏమిటి?దశావతారాలు …

కవి,లెక్చరర్ ఉమాశేషారావు వైద్య..

కామారెడ్డి జిల్లా ప్రతినిధి;జూలై 27,(అఖండ భూమి న్యూస్);

అవతారం అంటే ఏమిటి?దేవుడు అవతారం ఎందుకు ఎత్తుతాడు.విష్ణువు రాముని గా భూమిపై ‘అవతరించాడ’ని అంటారు కదామరి రామునిగా భూమిపై ఉన్న ఆ కాలంలో వైకుంఠములో విష్ణువు ఉన్న ట్లా? లేనట్లా? అవతారం అన గా దిగుట, పైనుండి క్రిందికి వచ్చుట. దేవుడు మనుష్యాది రూపాలను ఎత్తటం అవతార మంటారు. దేవుడు అవతార మెత్తడం అనగా పైనుండు దేవుడు లోక క్షేమము కొరకు భూలోకం వచ్చెనని అర్ధం.

ప్రపంచమందు అధర్మం ఎక్కు వైనపుడు చెడ్డవాళ్లను శిక్షిం చటానికి, మంచి వాళ్లని రక్షిం చటానికి భగవంతుడు పశు పక్షి మనుష్యాది రూపాలలో భూమిపైన అవతరించునని నమ్మకం.విష్ణువు మత్స్య కూర్మాది అవతారాలు ఎత్తెనని పరమ విజ్ఞానము. ఈ కల్పన లన్నింటికీ దేవుడు మానవుల కు ఉపకారము చేయాలంటే భౌతిక రూపం ధరించడం అవ సరం అన్న కల్పన ఆధారం.

ప్రజలు అనేక విధాల ఆపదలు వచ్చినప్పుడు భగవంతుడు వారి ఆపదలను తొలగించుట కు భౌతికరూపం ధరించుననే నమ్మకం అవతారకల్పనకు మూలాధారం. ప్రజలకు దుష్టు లచే ఆపద కలిగినప్పుడు ఇంద్రాది దేవతలు విష్ణువు వద్దకువెళ్ళిమొరపెట్టుకోవటం, ఆయన వాళ్లకు అభయమిచ్చి పంపటం, సరైన సమయం చూసుకొని భౌతిక రూపంలో భూమిపై అవతరించి దుష్టశిక్ష ణ చేయటం చాలామటుకు అవతారకథలప్రధానఇతివృత్తం.అవతారాలు కేవలం త్రిమూర్తులకు, ఆదిదేవతలకే పరిమితం కాలేదు. దేవతలు, రాక్షసులు, యక్షులు, అప్స రసలు, చివరకు మానవులు కూడా అవతారమెత్తవచ్చు.

ప్రస్తుతం మనం ‘రామునిగా విష్ణువు అవతరించాడు కదా! మరి అవతార పరిసమాప్తి అయ్యేంత వరకు వైకుంఠము లో విష్ణువు ఉన్నట్లా? లేనట్లా?’ అనికదాతెలుసుకోవాలనుకుంటున్నాము. ఈ విషయంతెలు సుకొనే ముందు ఒక ఉదాహర ణపరిశీలిద్దాము.ఉదాహరణకు పది సమానమైన ప్రమిదలు లో సమానమైన వత్తులు నిం పి, సమానమైన నూనె పోసి ఒక ప్రమిదను వెలిగించి, ఆ ప్రమిద తో మిగిలిన ప్రమిదలు వెలిగించి ఆ ప్రమిదల వరుసల లో పెట్టి; వేరొకరిని ఈ ప్రమిద ల వరుసలోని ఏ ప్రమిద తో నేను దీపం వెలిగించానో చెప్ప గలవా అంటే ఆ వ్యక్తి చెప్పగల డా?ఆ వ్యక్తే కాదు ఏ వ్యక్తి కూ డా చెప్పలేడుకారణం మిగిలిన ప్రమిదలను వెలిగించిన తొలి ప్రమిదవెలుగుతగ్గిపోదుమిగిలిన ప్రమిదల వలెప్రకాశిస్తుంది. కాని ఆ మిగిలిన ప్రమిదలకు తెలుసు; తనను వెలిగించిన ఆ దీపం ఏదో.ఆధునిక శాస్త్ర పరిశోధనలలో ని ‘క్లోనింగ్’ ప్రక్రి య గురించి మనకు అందరికీ తెలుసుకదాఅలాగేనారాయణుడు అవసరమైనప్పుడు తనకు ప్రతి రూపమైన అవతారాన్ని భూమిపైన అవతరింప జేస్తూ ఉంటాడు.

విష్ణువు ఎన్ని అవతారాలు ఒకేసారి ఎత్తినా; విడి విడి గా ఎత్తినా తన అస్తిత్వం కోల్పో డుతన అసలు రూపంతో వైకుంఠమ్ లో దర్శన మిస్తూనే ఉంటాడు… విష్ణువు నుండి ఉద్బవించినఈఅవతారములు తమ అవతార పరిసమాప్తి చెందిన తరువాత తమమూల అవతారమైనశ్రీమన్నారాయణుడి లో విష్ణువు లో ఐక్య మందుతాయి.ఒకసారి ఐక్య మందినా కూడా భక్తుల కోరిక మేరకు మరల, మరల అవే రూపాలతోఅవసరమైనప్పుడు దర్శనమిస్తూనే ఉంటాయి.

ఈ విధంగా అయ్య గారే విష్ణు మూర్తేకాకుండా; అమ్మగారు కూడా లక్ష్మిదేవి,భూలోకం పై అవతరించారు; అవతరిస్తారు.

అలాగే శివపార్వతులు,మిగిలి న దేవతలు సందర్భాన్ని బట్టి భూలోకం పై అవతరిస్తూ ఉంటారు.

Akhand Bhoomi News

error: Content is protected !!