రౌతులపూడి పోలీసులు పేకాట రాయుళ్లు పై దాడి  ఆరుగురు అరెస్ట్

రౌతులపూడి పోలీసులు పేకాట రాయుళ్లు పై దాడి

ఆరుగురు అరెస్ట్

రౌతులపూడి(అఖండభూమి న్యూస్ జులై 27):

రౌతులపూడి మండలంలో కాకినాడ జిల్లా ఎస్పీ శ్రీ జి బిందు మాధవ్ ఐపిఎస్ వారు జూద క్రీడల పై ఉక్కు పాదం మోపాలని ఆదేశాలు జారీ చేయడం జరిగింది

ఈరోజు ప్రత్తిపాడు సిఐ సూర్యఅప్పారావు కి రాబడిన సమాచారం మేరకు రౌతులపూడి ఎస్సై శ్రీ వెంకటేశ్వరరావు రావు మరియు సిబ్బందితో దిగుసువాడ గ్రామ శివారు తాండవ కాలువ గట్టు ప్రాంతంలో పేకాట రాయుళ్లు పై దాడి చేసి ఆరుగురు పేకాట రాయుళ్లను అరెస్ట్ చేసి వారి వద్ద 4,200/- రూపాయలను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేయటం జరిగింది.

రౌతులపూడి మండల పరిధిలో ఎవరైనా జూద క్రీడలకు పాల్పడిన లేదా అసాంఘిక కార్యక్రమాలు పాల్పడిన ప్రజలు ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలకు కానీ జోద క్రీడలు కానీ పాల్పడితే చట్టం పని తాను చేసుకుపోతుంది అని ఎవరిని కూడా ఉపేక్షించేది లేదని ఎస్సై వెంకటేశ్వరరావు తెలియజేశారు

Akhand Bhoomi News

error: Content is protected !!