నేడు దోమకొండకు మంత్రి సీతక్క, షబ్బీర్ అలీ రాక…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూలై 28 (అఖండ భూమి న్యూస్);
కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రానికి మంగళవారం జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్క, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు మహమ్మద్ అలీ షబ్బీర్, ఎంపీ సురేష్ సత్కర్ లు వస్తున్నట్లు దోమకొండ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు సీతారాం మధు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. దోమకొండ మండల కేంద్రంలోని పెద్దమ్మ ఫంక్షన్ హాల్ లో మంగళవారం నిర్వహించే సభకు హాజరైతునట్లు తెలిపారు. ఈ సమావేశంలో రేషన్ కార్డుల నూతన లబ్ధిదారులకు కార్డులు అందించడం, ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక చేయడం జరుగుతుందన్నారు. ఆయా మండలాల నుండి కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ప్రకటనలో పేర్కొన్నారు.